ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

శాంతిభద్రతలు గాడినపడేనా?

ABN, First Publish Date - 2023-05-03T00:18:42+05:30

శ్రీసత్యసాయి జిల్లాలో హిందూపురం పెద్ద పట్టణం. మరోవైపు ప్రశాంతతకు మారుపేరు. ఇక్కడి పోలీసు యంత్రాంగం నిత్యం అప్రమత్తంగా పనిచేయాల్సి ఉంటుంది. అయితే గతంలో జరిగిన పలు సంఘటనలు వి స్తుగొల్పాయి. పోలీసుల వైఫల్యాలను తేటతెల్లం చేశాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పురానికి ఏడాది తర్వాత పూర్తిస్థాయిలో డీఎస్పీ నియామకం

హిందూపురం, మే 2: ఉమ్మడి రాష్ట్రంలోనే హిందూపురం వాణిజ్యకేంద్రంగా పేరుగాంచింది. దశాబ్దాల క్రితం నుంచి పట్టణంలో పెద్దఎత్తున వ్యాపార కార్యకలాపాలు సాగుతున్నాయి. ఇతర రాష్ట్రాల నుంచి వ్యాపారం నిమిత్తం వచ్చి వెళ్తుంటారు. నూతనంగా వెలసిన శ్రీసత్యసాయి జిల్లాలో హిందూపురం పెద్ద పట్టణం. మరోవైపు ప్రశాంతతకు మారుపేరు. ఇక్కడి పోలీసు యంత్రాంగం నిత్యం అప్రమత్తంగా పనిచేయాల్సి ఉంటుంది. అయితే గతంలో జరిగిన పలు సంఘటనలు వి స్తుగొల్పాయి. పోలీసుల వైఫల్యాలను తేటతెల్లం చేశాయి. చిన్న చిన్న విషయాలకే వివాదాలు చిలికి చిలికి గాలివానగా మారిన చందగా అ శాంతికి దారితీశాయి. నెలల తరబడి పోలీసులు హిందూపురానికి కా పలా కాయాల్సిన పరిస్థితి వచ్చింది. అప్పటి పోలీసు అధికారులు అప్రమత్తమై ఉండిఉంటే ఇంత జరిగి ఉండేది కాదని ఉన్నతాధికారులే సీరియస్‌ అయిన సందర్భాలెన్నో ఉన్నాయి. ఈపరిస్థితుల్లో తాజాగా పూర్తిస్థాయి డీఎస్పీ నియామకంతో శాంతిభద్రతలు, అసాంఘిక కార్యకలాపాలపై నిఘా ఉంచుతారని ప్రజలు ఆశిస్తున్నారు.

కిందిస్థాయి సిబ్బందిలో జవాబుదారీతనం

గతంలో పెనుకొండ పోలీస్‌ సబ్‌డివిజన పరిధిలో హిందూపురం ఉండేది. జిల్లా విభజన తరువాత హిందూపురం నియోజకవర్గమే సబ్‌డివిజనగా ఏర్పడింది. దీంతో ఇక్కడికి నూతన డీఎస్పీని నియమించా రు. దీనివల్ల కిందిస్థాయి అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉంటా రు. అసాంఘిక కార్యకలాపాలు, అక్రమ రవాణాపై దృష్టి సారిస్తారని ప్రజలు ఆశిస్తున్నారు. డీఎస్పీ ఇక్కడే ఉండటంవల్ల సీఐలు, ఎస్‌ఐలు, సిబ్బంది విధుల్లో జాగ్రత్తగా వ్యవహరిస్తారని, దీనివల్ల పూర్తిస్థాయిలో పోలీసింగ్‌ పనిచేస్తుందని ప్రజలు భావిస్తున్నారు.

అసాంఘిక కార్యకలాపాలకు చెక్‌ పడేనా?

హిందూపురంలో మట్కా, పేకాట, బెట్టింగ్‌, కర్ణాటక మద్యం అక్రమ రవాణా, వ్యభిచారంలాంటి అసాంఘిక కార్యకలాపాలపై తరచూ కేసు లు నమోదవుతూనే ఉన్నాయి. అప్పట్లో స్థానికంగా డీఎస్పీ లేకపోవడం తో కిందిస్థాయి అధికారులు చెప్పిందే అమలయ్యేది. ఇకమీదట అలా జరగకపోవచ్చని ఆశాఖలో చర్చ సాగుతోంది. ప్రస్తుతం ఐపీఎల్‌ సీజన హవా సాగుతోంది. అదేస్థాయిలో బెట్టింగ్‌రాయుళ్లు పుట్టుకొచ్చారు. ఇప్పటివరకు బెట్టింగ్‌రాయుళ్లపై దృష్టిసారించిన దాఖలాలు కనబడలే దు. పేకాట విచ్చలవిడిగా సాగుతోంది. అంతకు ముంచు పోలీస్‌స్టేషన సమీపంలోనే మట్కా పట్టీలు రాస్తున్నా, మాకు కనిపించలేదన్నట్లు పోలీసులు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. పట్టణంలోని ఓ పోలీస్‌ స్టేషన సమీపంలోనే అధికార పార్టీకి చెందిన ఓనాయకుడు పె ద్దఎత్తున మట్కా రాస్తున్నాడని సాక్షాధారాలతో ఎస్పీకి, డీఐజీకి ఫిర్యా దు చేసినా స్పందించిన దాఖలాలు కనిపించలేదు. డీఎస్పీ నిఘా ఉంచి అరికట్టాల్సిన అవసరం ఉంది.

అధికార పార్టీ ఒత్తిళ్లను అధిగమించేనా?

జిల్లా విభజన నేపథ్యంలో సుమారు ఏడాది అనంతరం నూతనంగా ఏర్పడిన సబ్‌డివిజనకు డీఎస్పీగా కంజక్షన రెండు రోజుల క్రితం బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుత పరిస్థితుల్లో పోలీస్‌ అధికారులు అధికార పార్టీ నాయకులు చెప్పినట్లే నడుచుకుంటున్నారు. ఈయనకూడా వారి ఒత్తిళ్లకు తలొగ్గేనా? లేక అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపేనా అని పురం ప్రజలు చర్చించుకుంటున్నారు. మట్కా, గుట్కా, పేకాట, కర్ణాటక మద్యం తదితర అసాంఘిక కార్యకలాపాల్లో అధికార పార్టీ నాయకులు వెనకుండి నడిపిస్తున్నారని అదే పార్టీలోని మరోవర్గం నాయకులు ఆరోపిస్తున్నారు. వీటన్నింటిని అధిగమించి పోలీసు పాలన గాడినపడేనా అని ఎదురుచూస్తున్నారు.

Updated Date - 2023-05-03T00:18:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising