గెలుపోటములను సమానంగా తీసుకోవాలి
ABN, First Publish Date - 2023-06-05T23:54:58+05:30
క్రీడల్లో గెలుపోటములను సమానంగా తీసుకోవాలని నియోజకవర్గ టీడీపీ ఇనచార్జి పరిటాలశ్రీరామ్ పేర్కొన్నారు.
- పరిటాల శ్రీరామ్
ధర్మవరం, జూన 5: క్రీడల్లో గెలుపోటములను సమానంగా తీసుకోవాలని నియోజకవర్గ టీడీపీ ఇనచార్జి పరిటాలశ్రీరామ్ పేర్కొన్నారు. పరిటాల రవీంద్ర మెమోరియల్ ట్రస్టు ఆధ్వర్యంలో రాప్తాడు, ధర్మవరం సూపర్‌లీగ్ క్రికెట్ టోర్నీ ఫైనల్ మ్యాచ సోమవారం జరిగింది. ధర్మవరం అర్బన నుంచి ఇస్లాంలెవెన-ఫ్రెండ్ లెవెన జట్లు,. ధర్మవరంరూరల్ నుంచి మల్లేనిపల్లి-గొట్లూరు జట్లు తలపడ్డాయి. ఇస్లాంలెవన, గొట్లూరు జట్లు విజేతలుగా నిలిచాయి. విన్నర్స్ జట్టుకు పరిటాల శ్రీరామ్ చేతులమీదుగా రూ.10వేల నగదుతోపాటు ట్రోఫీని అందజేశారు. రన్నర్స్ ఫ్రెండ్స్‌లెవన, మల్లేనిపల్లి జట్లకు మెమెంటోలు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా పరిటాల శ్రీరామ్ మాట్లాడుతూ క్రీడాకారుల్లో ప్రతిభను వెలికితీసేందుకు ఇలాంటి టోర్నమెంట్లు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. క్రీడాస్ఫూర్తిని నింపుకోవాలన్నారు. అనంతరం టోర్నీ ఆర్గనైజర్స్ ఫణికుమార్, రాంపురంశీన, కేశగాళ్ల శ్రీనివాసులు, చిన్నూరు విజయ్‌చౌదరి, బొటు కిష్ట, శంకర, అమరాసుధాకర్, తోట వాసుదేవ, కామెంటరీ శ్రీనివాసులును ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు కమతం కాటమయ్య, చింతలపల్లి మహేశచౌదరి, పురుషోత్తంగౌడ్, మేకల రామాంజినేయులు, నాగూర్ హుస్సేన, బీమనేని ప్రసాదనాయుడు, గోసల శ్రీరాములు, అత్తర్ రహీంబాషా, బొట్టు కిష్ట, ఓంప్రకాశ, బీబీ, గరుడంపల్లి అంజి పాల్గొన్నారు.
Updated Date - 2023-06-05T23:54:58+05:30 IST