ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ
ABN, First Publish Date - 2023-04-25T00:05:38+05:30
రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ సోమవారం ముగిసింది.
ఎన్నికల బరిలో 11 మంది అభ్యర్థులు
పావగడ, ఏప్రిల్ 24: రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ సోమవారం ముగిసింది. నియోజకవర్గం నుంచి ఎన్నికల్లో పోటీ చేసేందుకు 16 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖ లు చేశారు. నామినేషన్ల ఉపసంహరణకు చివరి రోజున ఐదుగురు ఇండిపెండెంట్ అభ్యర్థులు హనుమంతరాయప్ప, కెంచప్ప, మహేష్, కృష్ణమూర్తి, ఓ హనుమంతరాయప్ప తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. మిగిలిన 11 మంది అభ్యర్థులు ఆమ్‌ఆద్మీ - రా మాంజనప్ప, కాంగ్రెస్ - హెచవీ వెంకటే్‌ష, జేడీఎస్ - తిమ్మరాయ ప్ప, బీజేపీ - కృష్ణానాయక్, బీఎ్‌సపీ - హనుమంతరాయ, కేఆర్‌పీ - నాగేంద్ర, బీబీకేడీ - రామసుబ్బయ్య, కేఆర్‌ఎస్ - నరసింహరాజు, ఇండిపెండెంట్ అభ్యర్థులు కామరాజు, శ్రీనివాస్, గోవిందప్పలతోపా టు నోటా ఓటు కలిపి మొత్తం 12 మంది బ్యాలెట్‌లో నమోదవుతున్నట్లు ఎన్నికల అధికారి అతీక్‌బాషా ప్రకటించారు.
Updated Date - 2023-04-25T00:05:38+05:30 IST