Anantapuram: 144 సెక్షన్ అతిక్రమించి.. వైసీపీ నేతల భారీ బైక్ ర్యాలీ..
ABN, First Publish Date - 2023-01-22T16:11:37+05:30
అనంతపురం: గుత్తి పట్టణంలో ఓవైపు కానిస్టేబుల్ (Constable) ప్రిలిమినరీ పరీక్షలు (Preliminary Examinations) జరుగుతున్నాయి. మరోవైపు...
అనంతపురం: గుత్తి పట్టణంలో ఓవైపు కానిస్టేబుల్ (Constable) ప్రిలిమినరీ పరీక్షలు (Preliminary Examinations) జరుగుతున్నాయి. మరోవైపు వైసీపీ నేతలు (YCP Leaders) భారీ బైక్ ర్యాలీ (Bike rally) నిర్వహించారు. కానిస్టేబుల్ పరీక్షల నేపథ్యంలో పరీక్ష కేంద్రాల సమీపంలో పోలీసులు 144 సెక్షన్ (144 Section) విధించారు. అయితే వైసీపీ నేతలు 144 సెక్షన్‌ను అతిక్రమించి భారీగా బైక్ ర్యాలీ నిర్వహించారు. మరోవైపు పరీక్ష కేంద్రానికి కూత వేటు దూరంలోనే గుత్తి మార్కెట్ యార్డ్ చైర్మన్ ప్రమాణ స్వీకారోత్సవ సభా ప్రాంగణాన్ని ఏర్పాటు చేశారు. సీఎం జగన్ (CM Jagan) పాటలతో, భారీ శబ్దాలతో సభా ప్రాంగణం దద్దరిల్లింది. పరీక్షా కేంద్రం వద్ద వైసీపీ సమావేశంతో డిజె సౌండ్స్ (DJ Sounds) ఏర్పాటు చేసినప్పటికీ పోలీసులు చూసి చూడనట్లు వ్యవహరించారు.
Updated Date - 2023-01-22T16:11:57+05:30 IST