రైతులను నట్టేట ముంచిన వైసీపీ : టీడీపీ
ABN, First Publish Date - 2023-04-25T00:04:22+05:30
వైసీపీ ప్రభుత్వం నాలుగేళ్లుగా రైతులను నట్టేట ముంచిందని టీడీపీ క్లస్టర్ ఇనచార్జి నాగేంద్ర విమర్శించారు.
రొద్దం, ఏప్రిల్ 24: వైసీపీ ప్రభుత్వం నాలుగేళ్లుగా రైతులను నట్టేట ముంచిందని టీడీపీ క్లస్టర్ ఇనచార్జి నాగేంద్ర విమర్శించారు. సోమవారం మండలంలోని కందుకూర్లపల్లిలో పార్టీ ఆధ్వర్యంలో ‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి’ కార్యక్రమం నిర్వహించారు. ఇం టింటికీ వెళ్లి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు. ఈసందర్భంగా నాయకులు మాట్లా డుతూ పంటలకు గిట్టుబాటు ధర కల్పించకుండా, ధాన్యాన్ని కొనుగోలు చేసి ఆదుకుంటామని మాయమాటలు చెప్పిందని విమర్శించారు. ఫలితంగా రైతులు అప్పుల పాలవుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. నిత్యావసర ధరలు పెరిగిపోవడంతో ఏమీ కొన లేం, తినలేం అన్న చందంగా తయారైందన్నారు. గ్యాస్, కరెంటు, పెట్రోల్, డీజల్ ధర లు ఆకాశాన్నంటాయన్నారు. నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితేనే రా ష్ట్రం బాగుపడుతుందన్నారు. కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి మురళి, రా మాంజినేయులు, వెంకటప్ప, శ్రీనివాసులు, శివప్ప, అంజినప్ప, హనుమన్న పాల్గొన్నారు.
Updated Date - 2023-04-25T00:04:22+05:30 IST