దేవుడి మాన్యం కబ్జాకు వైసీపీ నాయకుల యత్నం
ABN, First Publish Date - 2023-05-31T23:43:07+05:30
మండలంలోని బూదిలి కోటిలింగేశ్వర స్వామి ఆలయ మాన్యం భూమి 4.09 ఎకరాలను వైసీపీ నాయకులు కబ్జాకు యత్నించారు. బీజేపీ నాయకులు బాధితులకు అండగా నిలిచారు.
బాధితులకు అండగా నిలిచిన బీజేపీ
గోరంట్ల, మే 31: మండలంలోని బూదిలి కోటిలింగేశ్వర స్వామి ఆలయ మాన్యం భూమి 4.09 ఎకరాలను వైసీపీ నాయకులు కబ్జాకు యత్నించారు. బీజేపీ నాయకులు బాధితులకు అండగా నిలిచారు. బు ధవారం మాన్యం భూమిని పరిశీలించారు. కలిగెరి రంగప్ప నుంచి బూదిలి పొలం 531 సర్వేలోని 19.36 ఎకరాలపైకి 4.84 ఎకరాల భూ మిని బూదిలికి చెందిన ధరణీ, నాగప్ప భార్య బసమ్మ 1943లో కొనుగోలు చేశారు. సంతానం లేకపోవడంతో ఆమె తన 4.84 ఎకరాలను కోటిలింగేశ్వరస్వామి ఆలయం దూపదీప నైవేద్యం కోసం 1950లో వీ లునామా ద్వారా దానం చేసి, ఈతర్వాత మృతిచెందారు. అప్పటినుం చి బూదిలిలోని లింగాయతులు సంఘంగా ఏర్పడి, వారి ఆఽధీనంలో భూమిని సాగుచేసి ఆలయ అభివృద్ధికి కృషి చేశారు. విద్యుత సబ్‌స్టేషన కోసం ఆలయ మాన్యం భూమిలోని 75 సెంట్లను 2015లో ఉచితంగా ఇచ్చారు. 4.09 ఎకరాలు మిగిలింది. ప్రస్తుతం ఈ భూమి విలు వ రెండుకోట్ల రూపాయలకు పైబడి పలుకుతోంది. దీనిపై కన్నెసిన వైసీపీ నాయకులు... ఆపార్టీ మండల కన్వీనర్ లక్ష్మీనరసప్ప సోదరుడు రంగప్ప పేరున మాన్యం భూమిని కొనుగోలు చేశామని, ఇటీవల పొ లంలో బండరాళ్లు తొలి ఆక్రమించుకునే యత్నం చేశారు. దీన్ని అడ్డుకున్న లింగాయతుల సంఘం వారు ఆలయ భూమి సంరక్షణం కోసం ప్రయత్నిస్తున్నారు.
భూకబ్జా ప్రయత్నం వెనుక ఎమ్మెల్యే శంకర్‌నారాయణ సోదరుడి హస్తమున్నట్లు ఆరోపణలున్నాయి. ఈనేపథ్యంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యలు జీఎం శేఖర్ సూచన మేరకు, స్థానిక పార్టీ నాయకులు మాన్యం భూమిని పరిశీలించారు. ఏడు దశాబ్దాల క్రితం నుంచి దేవుని మాన్యంగా ఉన్న భూమిని వైసీపీ నాయకులు దౌ ర్జన్యంగా దురాక్రమణకు పాల్పడడాన్ని ఖండించారు. వైసీపీ నాయకు ల ఆగడాలను ఆపాలని సూచించారు. ఆలయ నిర్వాహకులకు అండ గా ఉంటామని భరోసా ఇస్తూ, దురాక్రమణలు భవిష్యతులో పునరావృతం కాకుండా రెవెన్యూ అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాం డ్ చేశారు. కార్యక్రమంలో బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ శ్రీనివాసులు, నా యకులు శంకర్‌రెడ్డి, ఖగేంద్ర, వెంకటాచలం, శంకర్, లక్ష్మీనర్సు, నరేష్; హరీష్, ఆంజనేయులు, అరుణ్ పాల్గొన్నారు.
Updated Date - 2023-05-31T23:43:07+05:30 IST