ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

యువగళం రూట్‌ మ్యాప్‌ ఖరారు

ABN, First Publish Date - 2023-04-06T00:39:13+05:30

నియోజకవర్గంలో యువనేత నారా లోకేశ యువగళం పాదయాత్ర రూట్‌మ్యాప్‌ ఖరారైందని బుధవారం మున్సిపల్‌ చైర్మన జేసీ ప్రభాకర్‌ రెడ్డి, టీడీపీ నియోజకవర్గ ఇనచార్జ్‌ జేసీ అశ్మితరెడ్డి తెలిపారు. 11న పెద్దపప్పూరు మండలం శింగనగుట్టపల్లి వద్ద నుంచి ప్రారంభమవుతుందన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

11న నియోజకవర్గంలోకి రాక.. మున్సిపల్‌ చైర్మన జేసీ ప్రభాకర్‌రెడ్డి

తాడిపత్రి, ఏప్రిల్‌ 5: నియోజకవర్గంలో యువనేత నారా లోకేశ యువగళం పాదయాత్ర రూట్‌మ్యాప్‌ ఖరారైందని బుధవారం మున్సిపల్‌ చైర్మన జేసీ ప్రభాకర్‌ రెడ్డి, టీడీపీ నియోజకవర్గ ఇనచార్జ్‌ జేసీ అశ్మితరెడ్డి తెలిపారు. 11న పెద్దపప్పూరు మండలం శింగనగుట్టపల్లి వద్ద నుంచి ప్రారంభమవుతుందన్నారు. అదేరోజు రాత్రి మండలంలోని జేసీ స్వగ్రామమైన జూటూరులో బస ఉంటుందన్నారు. 12న జూటూరు నుంచి బయలుదేరి తాడిపత్రి పట్టణ సరిహద్దుకు చేరుకొని బసచేస్తారన్నారు. 13న తాడిపత్రి పట్టణం నుంచి పాదయాత్ర ప్రారంభమై సాయంత్రం సరిహద్దులోని బుగ్గకు చేరుకొని అక్కడి నుంచి కర్నూలు జిల్లాలోకి ప్రవేశిస్తుందని ఆయన తెలిపారు. పాదయాత్రను పురస్కరించుకొని పెద్దఎత్తున సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటుచేశామని వారు తెలిపారు.

పెద్ద ఎత్తున హాజరుకావాలి

యువనేత నారా లోకేశ చేపట్టిన పాదయాత్ర నియోజకవర్గంలో జరగనున్న నేపథ్యంలో పెద్దఎత్తున ప్రజలు మద్దతు తెలపాలని జేసీ ప్రభాకర్‌రెడ్డి, అశ్మితరెడ్డి కోరారు. పాదయాత్రకు సంబంధించి ఏర్పాట్లను ముమ్మరం చేశామన్నారు. రాబోయే కాలం తెలుగుదేశందే అన్నారు. అప్పుడే తాడిపత్రి అభివృద్ధికి అవసరమైన సంక్షేమ పథకాలు, నిధులను తీసుకువచ్చే అవకాశం ఉంటుందన్నారు. పారిశ్రామికంగా తిరోగమనంలో ఉన్న తాడిపత్రిలో తిరిగి పునరుజ్జీవింపజేసేందుకు తాడిపత్రి ప్రజలకు లోకేశ అండదండలు అవసరమని వారు తెలిపారు.

Updated Date - 2023-04-06T00:39:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising