AP CID: ఆహా... ఏమీ అసాధారణ ప్రతిభ! నోరెళ్లబెట్టడం ఖాయం
ABN, First Publish Date - 2023-09-15T04:46:16+05:30
కారణమేదైనా వారిద్దరి పేర్లు తెలుగు రాష్ట్రాల్లో మార్మోగుతున్నాయి. ఒకరేమో... సీనియర్ ఐపీఎస్, సీఐడీ చీఫ్ సంజయ్ మరొకరేమో... అదనపు అడ్వొకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి. స్కిల్ డెవల్‌పమెంట్ కేసు దర్యాప్తును ఒకరు, కోర్టులో
గంగా నది నాసిక్‌లో పుట్టిందన్న ఏఏజీ
అక్కడ పుట్టింది కృష్ణా అని సీఐడీ చీఫ్
(అమరావతి - ఆంధ్రజ్యోతి): కారణమేదైనా వారిద్దరి పేర్లు తెలుగు రాష్ట్రాల్లో మార్మోగుతున్నాయి. ఒకరేమో... సీనియర్ ఐపీఎస్, సీఐడీ చీఫ్ సంజయ్ మరొకరేమో... అదనపు అడ్వొకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి. స్కిల్ డెవల్‌పమెంట్ కేసు దర్యాప్తును ఒకరు, కోర్టులో ఒకరు ముందుకు నడిపిస్తున్నారు. ఈ కేసు గురించి పొరుగు రాష్ట్రంలోనూ వివరించే లక్ష్యంతో గురువారం హైదరాబాద్‌లో ప్రెస్‌మీట్ పెట్టారు. అక్కడే... తమ ‘జనరల్ నాలెడ్జ్’ ఎంత గొప్పగా ఉందో చాటుకున్నారు. కేసు పుణెలో ప్రారంభమైందని సూటిగా చెబితే పోయేది. కానీ... నాటకీయత జోడించే క్రమంలో బోల్తా పడ్డారు. ‘‘గంగా నది ఎక్కడ పుట్టిందో ఈ కేసు కూడా అక్కడే పుట్టింది. గంగ నాసిక్‌లో పుట్టినట్లు.. ఈ కేసుకు పుణె నాసిక్ పాయింట్ లాంటిది. గంగా నది నాసిక్ నుంచి ప్రవహిస్తూ.. బోటమ్ పాయింట్‌కు చేరినట్లు... ఈ కేసు చివరికి ఆంధ్రప్రదేశ్‌కు చేరింది’’ అని పొన్నవోలు వివరించారు. ‘గంగా నది నాసిక్‌లో పుట్టింది’ అని ఏఏజీ అనగానే పక్కనే ఉన్న సంజయ్.. అక్కడ పుట్టింది గంగ కాదు కృష్ణా నది అని ‘సవరించారు.’ మైక్‌ను చేతితో మూసేసి ‘కృష్ణా.. కృష్ణా..’ అంటూ చిన్నగా చెప్పారు. ఏఏజీ అది కూడా వినిపించుకోలేదు. ‘గంగా నది నాసిక్‌లో పుట్టింది’ అంటూ మళ్లీ మళ్లీ చెప్పారు.
అసలు విషయం ఏమిటంటే... నాసిక్‌లో పుట్టింది గంగా కాదూ, కృష్ణా నదీ కాదు. మహారాష్ట్రలోని నాసిక్ సమీపంలోని త్రయంబకంలో గోదావరి నది ఉద్భవించింది. గంగ పుట్టింది హిమాలయాల్లోని గంగోత్రిలో! కృష్ణా నది జన్మస్థానం మహారాష్ట్రలోని పడమటి కనుమల్లో ఉన్న మహాబలేశ్వరం! ఇదీ అసలు విషయం! కానీ... కేసులో తాము చెప్పిందే నమ్మాలంటున్నట్లు, గంగ నాసిక్‌లో పుట్టిందన్నా నమ్మాలంటారేమో!
Updated Date - 2023-09-15T12:55:45+05:30 IST