ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

AP Politics : చంద్రబాబు, పవన్‌పై మంత్రి జోగి రమేష్ అనుచిత వ్యాఖ్యలు

ABN, First Publish Date - 2023-07-28T20:22:44+05:30

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు (AP Elections) సమీపిస్తున్న కొద్దీ అధికార, ప్రతిపక్ష పార్టీల నేతల మాటలు శృతిమించిపోతున్నాయి. మరీ ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీల నేతల ప్రశ్నలకు ఏపీ మంత్రులు (AP Ministers) సమాధానం చెప్పలేక బూతులు మాట్లాడేస్తున్నారు...

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు (AP Elections) సమీపిస్తున్న కొద్దీ అధికార, ప్రతిపక్ష పార్టీల నేతల మాటలు శృతిమించిపోతున్నాయి. మరీ ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీల నేతల ప్రశ్నలకు ఏపీ మంత్రులు (AP Ministers) సమాధానం చెప్పలేక బూతులు మాట్లాడేస్తున్నారు. ఇటీవల ‘వారాహి యాత్ర’ (Varahi Yatra) జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan), ‘యువగళం పాదయాత్ర’ (Yuvagalam Padayatra) పేరిట యువనేత నారా లోకేష్ (Nara Lokesh) .. మరోవైపు నియోజకవర్గాల పర్యటన, ప్రాజెక్టులపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌తో టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu).. అధికార వైసీపీకి చుక్కలు చూపిస్తున్నారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ తరుణంలో వారికి కౌంటర్ ఇచ్చే పరిస్థితి లేక తాజాగా మంత్రి జోగి రమేష్ (Minister Jogi Ramesh).. చంద్రబాబు, పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం నాడు అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పర్యటించిన మంత్రి.. అమలాపురంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రమాణ స్వీకారంలో పాల్గొన్నారు.


మళ్లీ అనుచిత వ్యాఖ్యలు..!

సింహాన్ని ఎదుర్కొనేందుకు గుంట నక్కలు, ఊర కుక్కలు ఒక్కటయ్యాయి. చంద్రబాబుకు, పవన్ కళ్యాణ్‌కు ఆంధ్రప్రదేశ్‌లో ఆధార్ కార్డు, ఇల్లు ఉందా..?. రాజకీయాలు చేసేది ఏపీలో.. ఉండేది పక్కరాష్ట్రం తెలంగాణలో.. విషం కక్కేది మాత్రం ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న 5 కోట్ల ప్రజలపైనా..?. చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లకు దమ్ము, ఖలేజా ఉంటే సింగిల్‌గానే పోటీ చేయాలి. ఎన్నికలకు కుక్కలు, నక్కలు, పందులు కలిసి వస్తాయి.. కానీ సింహం సింగిల్ గానే వస్తుంది. 2024 ఎన్నికల్లో అమలాపురంలోనే కాదు కోనసీమ జిల్లాలో ఉన్న ఏడు నియోజకవర్గలలో వైసీపీ జెండా ఎగరవేస్తాం. వచ్చే ఎన్నికల్లో గెలిచి మరోసారి వైసీపీ సత్తా చాటి.. సీఎం వైఎస్‌ జగన్‌ను సీఎం చేసుకుంటాం. కొందరు ప్రభుత్వంపై చేస్తున్న విష ప్రచారం వల్ల తాము భయపడే ప్రసక్తి లేదుఅని మంత్రి జోగి రమేష్ చెప్పుకొచ్చారు. ఇటీవల గుంటూరులో జరిగిన ఓ కార్యక్రమంలో వైఎస్ జగన్ సమక్షంలో పవన్‌ను పిచ్చికుక్క, పెళ్లాలను మార్చినంత ఈజీగా పార్టీలు మారుస్తాడని కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. ఈ కామెంట్స్‌పై జనసైనికులు తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతూ.. మంత్రి దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు. తాజా కామెంట్స్‌పై టీడీపీ, జనసేన నుంచి ఎలాంటి రియాక్షన్స్ వస్తాయో వేచి చూడాలి మరి.

Updated Date - 2023-07-28T20:27:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising