ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

సీఎం సార్‌.. హామీ నెరవేర్చండి!

ABN, First Publish Date - 2023-06-27T02:53:20+05:30

అమరావతి సచివాలయంలో సీపీఎస్‌ ఉద్యోగులు కదం తొక్కారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఓపీఎస్‌ పునరుద్ధరించాల్సిందేనన్న

సచివాలయ సీపీఎస్‌ ఉద్యోగుల సంఘం

అమరావతి, జూన్‌ 26(ఆంధ్రజ్యోతి): అమరావతి సచివాలయంలో సీపీఎస్‌ ఉద్యోగులు కదం తొక్కారు. మంత్రివర్గం ఆమోదించిన జీపీఎస్‌ విధానాన్ని ముక్తకంఠంతో వ్యతిరేకించారు. సీపీఎస్‌ వద్దు, జీపీఎస్‌ వద్దు.. ఓపీఎస్‌ పునరుద్ధరించాల్సిందేనని నినదించారు. ఉద్యోగులు కొద్ది సేపు విధులు బహిష్కరించి తమ నిరసన తెలిపారు. జీపీఎస్‌ ప్రతిపాదనను తాము పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని ఏపీ సచివాలయ సీపీఎస్‌ ఉద్యోగుల సంఘం స్పష్టం చేసింది. సచివాలయంలో అందుబాటులో ఉన్న మంత్రులు మేరుగ నాగార్జున, కాకాణి గోవర్థనరెడ్డికి సంఘం నేతలు వినతిపత్రాలు అందజేశారు. జూలై 8న సీపీఎస్‌ రద్దుపై 13 ఉమ్మడి జిల్లాల కలెక్టరేట్ల వద్ద ధర్నాలు చేయాలని నిర్ణయించినట్లు సంఘం నేతలు సంయుక్త ప్రకటనలో తెలిపారు.

హామీ మరిస్తే ఎలా?

సీఎం జగన్‌ గత ఎన్నికల సమయంలో స్వయంగా ఇచ్చిన హామీని మరిస్తే ఎలా అని సీపీఎస్‌ ఉద్యోగుల సంఘం అధ్యక్షు డు రాజేశ్‌ ప్రశ్నించారు. సచివాలయ సీపీఎస్‌ సంఘం తీర్మానం మేరకు సచివాలయంలోని ప్రతి సీపీఎస్‌ ఉద్యోగీ స్పందన కార్యక్రమంలో వినతులు ఇచ్చినట్టు తెలిపారు. జీపీఎస్‌ ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్నామన్నారు. ఇప్పటికైనా సీఎం జగన్‌ ఇచ్చిన హామీ మేరకు ఓపీఎస్‌ పునరుద్ధరించాలని డిమాండ్‌ చేశారు.

మేం పాలాభిషేకాలు చేయలేదు

సంఘం ఉపాధ్యక్షుడు నాపా ప్రసాద్‌ మాట్లాడుతూ.. మొదటి క్యాబినెట్‌లోనే ఓపీఎ్‌సకు వెళుతున్నామని నిర్ణ యం తీసుకుని, మళ్లీ యూటర్న్‌ తీసుకుని ఇటీవల జరగిన కేబినెట్‌లో జీపీఎస్‌ తీసుకొస్తున్నట్లు నిర్ణయం తీసుకోవడం ఏమిటని ప్రశ్నించారు. సీఎం జగన్‌కు జరిగిన పాలాభిషేకాల్లో సీపీఎస్‌ ఉద్యోగు లు పాల్గొనలేదన్నారు. ఎన్నికలకు ముందు జగన్‌ చేసిన పాదయాత్రలో 109 సార్లు సీపీఎస్‌ రద్దు చేస్తామని హామీ ఇచ్చారని, మేనిఫెస్టోలో కూడా పెట్టారని సచివాలయ సీపీఎస్‌ ఉద్యోగుల సంఘం జనరల్‌ సెక్రటరీ అంబటి వెంకటేశ్వర్లు అన్నారు. ఉద్యోగ సంఘాల జేఏసీల్లో ఉన్న నేతలందరూ కూడా ఓపీఎ్‌సలోనే ఉన్నారని అప్సా మాజీ కార్యదర్శి రామకృష్ణ అన్నారు. వాళ్లకి అది మంచి అనిపించినప్పుడు జేఏసీ నేతలనూ జీపీఎ్‌సలోకి తీసుకురావాలని చెప్పారు. 4 ప్రధాన సంఘాల నాయకులు జీపీఎ్‌సను స్వాగతించి సీపీఎస్‌ ఉద్యోగులకు తీవ్రమైన అన్యాయం చేశారని సచివాలయ సెక్షన్‌ ఆఫీసర్ల సంఘం అధ్యక్షులు రంగస్వామి విమర్శించారు. మొదటి నుంచి నాలుగు సం ఘాల నాయకులు ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. సీపీఎస్‌ ఉద్యోగుల ఉద్యమానికి తాము సంపూర్ణ మద్దతు తెలుపుతున్నామన్నారు. అదేవిధంగా సచివాలయ ఏఎ్‌సవోల సంఘం అధ్యక్షులు హరినాథ్‌ జీపీఎస్‌ రద్దు చేసి ఓపీఎస్‌ తీసుకురావాలన్నారు.

Updated Date - 2023-06-27T02:53:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising