Governor: గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కీలక వ్యాఖ్యలు
ABN, First Publish Date - 2023-01-31T19:10:59+05:30
ప్రపంచంలోని టాప్ 100 యూనివర్సిటీల్లో ఏ ఒక్క భారత వర్సిటీ చోటు సాధించలేకపోవడం విచారకరమని గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ (Governor Biswabhusan Harichandan) అన్నారు.
విశాఖ: ప్రపంచంలోని టాప్ 100 యూనివర్సిటీల్లో ఏ ఒక్క భారత వర్సిటీ చోటు సాధించలేకపోవడం విచారకరమని గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ (Governor Biswabhusan Harichandan) అన్నారు. దక్షిణ భారత యూనివర్సిటీల వైస్ చాన్సలర్స్ సదస్సు ఏర్పాటు చేశారు. ఆ సదస్సులో పాల్గొన్న గవర్నర్ మాట్లాడారు. బోధన, పరిశోధన రంగాల్లో చైనా, ఇజ్రాయిల్ కంటే వెనకంజలో ఉన్నామన్నారు. రీసెర్చ్ విభాగంలో విశేష పురోగతి సాధించాల్సిన అవశ్యకత ఉందన్నారు. జాతీయ విద్యావిధానం-2020 అమల్లోకి వచ్చాక పురోగతిలో ఉన్నామని గవర్నర్ తెలిపారు. ఉన్నత విద్యారంగంలో పరిశోధనలే కీలకమన్నారు. భావి నేతలను తీర్చిదిద్దడంలో వర్సిటీల పాత్ర ఎనలేనిదని కొనియాడారు. ఆత్మనిర్భర్ భారత్ నినాదం వర్సిటీల్లో అమలు కావాలని గవర్నర్ బిశ్వభూషణ్ సూచించారు.
Updated Date - 2023-01-31T19:11:04+05:30 IST