ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Pawankalyan : పొత్తులు ఖాయం

ABN, First Publish Date - 2023-05-12T03:36:34+05:30

నన్ను సీఎం చేయాలని టీడీపీ, బీజేపీ వాళ్లు ఎందుకంటారు? వాళ్ల నోటి నుంచి ఒక్క మాట కూడా రాదు. వారి స్థానంలో నేనున్నా అనను. మన బలం చూపించి, సత్తా చాటి పదవులు తీసుకోవాలి. కండిషన్లు పెడితే జరిగేది కాదు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కచ్చితంగా పెట్టుకుంటాం.. అందరినీ ఒప్పిస్తాం

ఢిల్లీ వెళ్లినప్పుడు ఇదే చెప్పాం.. నా వైఖరి మారదు

వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వను.. ముందస్తుకు రెడీనే

సీఎం పదవి దానంతట అది వరించి రావాలి!

జనసేనకు 7 నుంచి 30ు ఓటు బ్యాంకు

గతం కంటే రెట్టింపు.. మిగతా పార్టీలు గమనించాలి

వైసీపీ నుంచి పవర్‌ను తప్పించి ప్రజలకు

పవర్‌ ఇవ్వాలన్నదే నా ఆకాంక్ష: పవన్‌ కల్యాణ్‌

నన్ను సీఎం చేయాలని టీడీపీ, బీజేపీ వాళ్లు ఎందుకంటారు? వాళ్ల నోటి నుంచి ఒక్క మాట కూడా రాదు. వారి స్థానంలో నేనున్నా అనను. మన బలం చూపించి, సత్తా చాటి పదవులు తీసుకోవాలి. కండిషన్లు పెడితే జరిగేది కాదు.

- పవన్‌ కల్యాణ్‌

అమరావతి, మే 11 (ఆంధ్రజ్యోతి): వచ్చే ఎన్నికల్లో పొత్తులు కచ్చితంగా పెట్టుకుంటామని జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ తేల్చిచెప్పారు. వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వనని పునరుద్ఘాటించారు. ‘పొత్తుల కోసం అందరినీ ఒప్పిస్తాం.. కొన్ని సార్లు ఒప్పుకోకపోవచ్చు. కానీ రాష్ట్రంలో ఉన్న ఫ్యాక్షన్‌ ఫిగర్స్‌ చూపించైనా ఒప్పిస్తాం. మొన్న ఢిల్లీకి వెళ్లినప్పుడు ఇదే విషయం చెప్పాం. పొత్తులపై నా వైఖరిలో ఎలాంటి మార్పూ లేదు’ అని కుండబద్దలు కొట్టారు. గురువారమిక్కడ మంగళగిరి పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రాన్ని వైసీపీ అతలాకుతలం చేసి.. అస్తవ్యస్తం చేస్తే ఎందుకు ఊరుకుంటామని ప్రశ్నించారు. కచ్చితంగా తిరగబడతామని స్పష్టం చేశారు. ‘నేను 2008 నుంచి రాజకీయాల్లో ఉన్నాను. బీఆర్‌ఎస్‌, బీజేపీ కూడా పొత్తులతో బలపడిన పార్టీలే. ప్రతి ఒక్క పార్టీకీ తనదైన బలమైన వర్గం, ఓటు శాతం ఉంటుంది. ఎంత వరకూ ప్రభావితం చూపించగలదు.. ఎన్ని సీట్లు సంపాదిస్తుందో దృష్టిలో పెట్టుకోవాలి. అందులో భాగంగానే పొత్తులతో వెళ్తామంటున్నాను. బలంగా ఉన్న పార్టీలు కలవాలి. కమ్యూనిస్టులు కూడా కలిసి వస్తే మంచిదే. కానీ కలిసి రారు’ అని వ్యాఖ్యానించారు. మీరు సీఎం రేసులో లేరా అని ప్రశ్నించగా.. ‘సీఎం రేసులోనా? మీరు చేసేయండి.. అందరూ సంసిద్ధంగా ఉంటే.. మీ ప్రయత్నం మీరు చేస్తే.. పదవి అనేది తనంతట తానే వరిస్తుంది. కష్టపడి పని చేస్తే ముఖ్యమంత్రి పదవి అనేది వరించి తీరాలి. దాని కోసమే పని చేస్తున్నాను’ అని బదులిచ్చారు. ఇంకా ఏమన్నారంటే...

అడ్డగోలుగా రాజకీయ ఫ్యాక్షనిజం..

వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వను అనడానికి కారణం ఆ పార్టీయే. అడ్డగోలుగా రాజకీయ ఫ్యాక్షనిజం, ప్రత్యర్థి పార్టీలను హింసకు గురి చేస్తోంది. నిర్మాణాత్మక రాజకీయాలు నాకు ఇష్టం. మనకు బలం ఉంది.. అల్లరి చేసి, గోల చేసి మేమున్నామని ఉనికి చాటుకోవడానికి పార్టీ పెట్టలేదు. 2014లో కూడా చాలా అధ్యయనం చేసిన తర్వాత, చర్చలు జరిపి ఆలోచించిన తర్వాత బీజేపీ, టీడీపీకి సపోర్టు చేశాను. ఆ రోజు సీట్లు తీసుకోకపోవడానికి కారణం, మేం పార్టీ పెట్టి ఒక నెల కూడా కాలేదు. అభ్యర్థులను వెతుక్కునే పరిస్థితి లేదు. 2019లో 137 స్థానాల్లో పోటీ చేశాం. జనసేనకు 7 శాతం ఓటింగ్‌ వచ్చింది. ప్రతికూల పరిస్థితుల్లో ఇంత వచ్చిందంటే సామాన్యమైన విషయం కాదు. బలం ఉన్న చోట 18, 20, 30 శాతం వరకూ ఓటింగ్‌ ఉంది. మా ఓటుబ్యాంకు ఇప్పుడు గత ఎన్నికల కంటే రెట్టింపయింది. మిగిలిన పార్టీలు దానిని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. రాయలసీమలో అంత ఓటు బ్యాంకు లేకపోయినా.. పట్టున్న ప్రాంతాల్లో మాత్రం బలమైన ఓటింగ్‌ ఉంది. ఈ సారి జనసేనతో అందరూ కలిసి వస్తే సంతోషం. మాగౌరవం ఉండేలా, అన్నీఉంటే కచ్చితంగా పొత్తులతోనే ముందుకు వెళ్తాం.

ముందస్తు నిజమైతే..

ముందస్తు ఎన్నికలు వస్తాయంటున్నారు.. నిజమైతే మేమూ సిద్ధమవుతాం. జూన్‌ నుంచి మరింతగా క్షేత్రస్థాయిలో తిరుగుతాం. ఎట్టి పరిస్థితుల్లోనూ వైసీపీ దాష్టీకాన్ని బలంగా ఎదుర్కొంటాం. సీఎం పదవి అనేది తానై వరించాలి. దాని కోసం వెంపర్లాడను. నిస్వార్థంగా ఉండాలి, పదవులు వరించి రావాలి. వాటి కోసం పాకులాడడం నా వ్యక్తిత్వం కాదు. మీరు వాళ్లను సీఎం చేయడానికి ఉన్నారా అన్న వ్యాఖ్యలు చేస్తున్నవారు.. వెంటనే వాటిని ఉపసంహరించుకోవాలి. భవిష్యత్‌లో జనసేనకు ఎవరైనా మంచి సలహా ఇద్దామనుకున్నవారు.. ముందు మమ్మల్ని గెలిపించాలి. గెలిపించకుండా.. సీఎం పదవి అడగాలన్న వాదనలో పస ఉండదు. ‘సేఫ్‌ ఆంధ్రప్రదేశ్‌’ నా కండిషన్‌.. వైసీపీ నుంచి పవర్‌ను తప్పించి, ప్రజలకు పవర్‌ ఇవ్వాలన్నదే నా ఆకాంక్ష. దాని కోసం పని చేస్తాను. చాలా మంది మీరు తగ్గడం ఏమిటి, వెళ్లడం ఏమిటని అన్నారు.. మీరు పొత్తులు పెట్టుకోకూడదు.. మిమ్మల్ని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించాలన్నారు. 2019లో 137స్థానాల్లో పోటీచేసినప్పుడు కనీసం 30-40 స్థానాల్లో జనసేన గెలిచి ఉండాలి. అలా జరగలేదు.

గ్రామీణ వ్యవస్థను చంపేశారు..

రాష్ట్రంలో గ్రామీణ వ్యవస్థను చంపేశారు. ప్రభుత్వ విధానాలు బాగోలేనప్పుడు, సర్పంచ్‌లు వైసీపీ అండతో గెలిచినా ప్రయోజనం ఏమిటి...? కేరళలో పంచాయతీరాజ్‌ వ్యవస్థ ఎలా పని చేస్తుందో చూడాలని అక్కడి మంత్రి నన్ను ఆహ్వానించారు. కేరళ తరహాలో స్థానిక సంస్థలను బలోపేతం చేయాలి.

అందరినీ కలుపుకొని వెళ్లే మనస్తత్వం నాది. లెఫ్ట్‌, రైట్‌ అన్న వైరుఽధ్య భావనలు నాకు లేవు. కమ్యూనిస్టులు బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నారు. వారిద్దరూ సైద్ధాంతికంగా కలవరు.

ముందస్తుఎన్నికలు వస్తాయం టున్నారు.. నిజమైతే మేమూ సిద్ధమవు తాం. జూన్‌ నుంచి మరింతగా క్షేత్రస్థాయిలో తిరుగుతాం. - పవన్‌ కల్యాణ్‌

Updated Date - 2023-05-12T03:43:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising