Viveka Case: వివేకా కేసులో అప్రూవర్ దస్తగిరి సంచలన వ్యాఖ్యలు.. ఏబీఎన్‌కు కొత్త విషయాలు వెల్లడి
ABN, First Publish Date - 2023-06-26T21:35:16+05:30
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి బాబాయి, మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో అప్రూవర్‌గా ఉన్న దస్తగిరి ఏబీఎన్-ఆంధ్రజ్యోతికి ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. వైసీపీ శ్రేణులు రాజీకి రమ్మని రాయబారాలు పంపుతున్నారని సంచలన విషయాన్ని వెల్లడించాడు.
కడప: ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి బాబాయి, మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో అప్రూవర్‌గా ఉన్న దస్తగిరి ఏబీఎన్-ఆంధ్రజ్యోతికి ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. వైసీపీ శ్రేణులు రాజీకి రమ్మని రాయబారాలు పంపుతున్నారని సంచలన విషయాన్ని వెల్లడించాడు. పెద్దమనుషులతో రాజీ అయితే డబ్బులు కూడా ఇప్పిస్తామంటూ ప్రలోభ పెట్టారని తెలిపాడు. తాను చావడానికైనా సిద్ధం.. కానీ రాజీ ప్రసక్తే లేదని కుండబద్ధలు కొట్టినట్టు చెప్పాడు.
వివేకా హత్యకేసులో ఒక్కొక్కరు అరెస్ట్ అవుతున్నారని, తనను లొంగతీసుకునేందుకు వైసీపీ నేతలు ప్రయత్నిస్తున్నార దస్తగిరి చెప్పాడు. తాను ఎవరికి లొంగను.. కోర్టులోనే తేల్చుకుంటానని తన అభిప్రాయాన్ని చెప్పాడు. తనపై వైసీపీ నేతలు కక్షకట్టి వేధిస్తున్నారని వాపోయాడు. అక్రమ కేసులు పెట్టి ఇబ్బంది పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు.
Updated Date - 2023-06-26T21:36:55+05:30 IST