ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Prabhas Vs Pawan Fans : అత్తిలిలో హద్దులు దాటిన అభిమానం.. వాట్సాప్ స్టేటస్ పెట్టుకోనందుకు చంపేశాడు..!

ABN, First Publish Date - 2023-04-23T11:29:08+05:30

అభిమాన నటుల వీడియో స్టేటస్‌ (Video Status) విషయంలో జరిగిన వివాదం హత్యకు దారితీసిన ఘటన పశ్చిమగోదావరి జిల్లా (West Godavari) అత్తిలిలో జరిగింది..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పశ్చిమగోదావరి/అత్తిలి : అభిమాన నటుల వీడియో స్టేటస్‌ (Video Status) విషయంలో జరిగిన వివాదం హత్యకు దారితీసిన ఘటన పశ్చిమగోదావరి జిల్లా (West Godavari) అత్తిలిలో జరిగింది. తణుకు సీఐ సీహెచ్ ఆంజనేయులు వివరాల ప్రకారం.. ఏలూరుకు చెందిన పెయింటర్లు హరికుమార్, కిశోర్‌లు అత్తిలిలో ఓ ఇంటికి పెయింట్ వెయ్యటానికి మూడు రోజుల కిందట వచ్చారు. హరికుమార్ ప్రభాస్ (Prabhas) అభిమాన సంఘానికి కార్యదర్శిగా ఉన్నాడు. తన వాట్సాప్‌లో (Whats App) ప్రభాస్ వీడియోను స్టేటస్‌గా పెట్టుకున్నాడు. కిశోర్ పవన్ కల్యాణ్ అభిమాని. దీంతో పవన్ కల్యాణ్ (Pawan Kalyan) వీడియోను కూడా స్టేటస్‌లో పెట్టుకోవాలని హరికుమార్‌కు చెప్పాడు. అందుకు హరికుమార్ ఒప్పుకోలేదు. దీనిపై ఇద్దరి మధ్య శుక్రవారం రాత్రి ఘర్షణ జరిగింది. చిన్నగా మొదలైన ఈ గొడవ చిలికి చిలికి గాలివానలా మారి కొట్టుకునేవరకూ వెళ్లింది. హరికుమార్ సెంట్రింగ్ పైపుతో కొట్టడంతో పాటు సిమెంట్ రాయితో ముఖం మీద మోదడంతో కిశోర్ అక్కడికక్కడే చనిపోయాడు. ఘటన అనంతరం హరికుమార్ పరారిలో ఉన్నాడు. ఇలా జరిగిందని తెలుసుకున్న ఇద్దరు హీరోల అభిమానులు షాకవుతున్నారు. అభిమానం హద్దుల్లో ఉంటేనే అందంగా ఉంటుందని.. పరిధి దాటితే ప్రాణాల మీదకు వస్తుందనటానికి ఇదొక ఉదాహరణకు చెప్పుకోవచ్చు.

ఈ మధ్య స్టార్ హీరోల అభిమానుల మధ్య గొడవలు, కొట్టుకోవడాలు ఎక్కువైపోయాయి. అగ్రహీరోల్లో లేని గొడవలు, మనస్పర్థలు అభిమానుల్లో ఎక్కువ అవుతున్నాయి. ఏదైనా ప్రోగ్రామ్స్, స్టేజ్ మీద స్టార్ హీరోలు కలిసినప్పుడు ఎంతో సంతోషంగా, కలివిడిగా ఉంటారు. ఎక్కడ ఎదురుపడినా చక్కగా మాట్లాడుకుంటారు. కానీ.. అభిమానులు మాత్రం తమ హీరోనే గొప్పని చెప్పుకుంటూ కయ్యానికి కాలు దువ్వుతున్నారు. ఒక్కోసారి ఈ ఫ్యానిజం హద్దులు దాటి ప్రాణాల మీదకు తెచ్చుకుంటూ ఉంటారు. ఇక సోషల్ మీడియా వేదికగా అయితే అభిమానుల మధ్య మాటల యుద్ధానికి హద్దే లేకుండా పోయింది.

Updated Date - 2023-04-23T11:30:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising