ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

పేక మేడల్లా కూలుతున్న వంతెనలు

ABN, First Publish Date - 2023-11-23T03:02:58+05:30

అనంతపురం జిల్లాలో తుంగభద్ర ఎగువ కాలువ(హెచ్చెల్సీ)పై ఉన్న వంతెనలు పేకమేడల్లా కూలిపోతున్నాయి.

నాలుగున్నరేళ్లుగా చిల్లిగవ్వ విదల్చని ప్రభుత్వం

హెచ్చెల్సీపై పొంచి ఉన్న ముప్పు

రాయదుర్గం, నవంబరు 22: అనంతపురం జిల్లాలో తుంగభద్ర ఎగువ కాలువ(హెచ్చెల్సీ)పై ఉన్న వంతెనలు పేకమేడల్లా కూలిపోతున్నాయి. ఆంధ్ర సరిహద్దులోని 105 కి.మీ. వద్ద నుంచి 84 కి.మీ. పొడవున 51 నిర్మాణాలు చేశారు. వాటిలో గ్రామాలకు రాకపోకలు సాగించే వంతెనలు, బ్రిడ్జిలు, యూటీలు, అక్విడెక్ట్‌లు ఉన్నాయి. వంతెనలు కూలిన సమయంలో హెచ్చెల్సీకి ఇరువైపులా ఉన్న గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోతున్నాయి. హెచ్చెల్సీ ఆధునికీకరణకు రాష్ట్ర ప్రభుత్వం 15 ఏళ్ల క్రితం నిధులు మంజూరు చేయగా, కాంట్రాక్టర్లు అరకొరగా పనులు చేసి వదిలేశారు. కాలువ వెడల్పు, లైనింగ్‌ పనులు కొన్ని పూర్తయినా, వంతెనలను పునర్నిర్మించకుండా వదిలేశారు. 1962లో నిర్మించిన వంతెనలపైనే నేటికీ రాకపోకలు సాగుతున్నాయి. శిథిలమైన ఈ వంతెనలు ఇటీవల నాలుగుచోట్ల కూలిపోయాయి. ఏడాది క్రితం ఉద్దేహాళ్‌ - మల్లికేతి మధ్య కాలువపై ఉన్న వంతెన కూలిపోవడంతో కూలీలు ప్రయాణించే వాహనం కాలువలో పడిపోయి ఒకరు మృతి చెందారు. కణేకల్లు చెరువు వద్ద మంగళవారం ఒక వంతెన కుప్పకూలి వరిధాన్యం తరలించే వాహనం కాలువలో పడిపోయింది. హెచ్చెల్సీపై వంతెనలన్నీ శిథిలావస్థకు చేరాయని, యుద్ధప్రాతిపదికన రూ.20కోట్లు మంజూరు చేయాలని అధికారులు పలుమార్లు ప్రభుత్వానికి విన్నవించినా, చిల్లిగవ్వ కూడా ఇవ్వలేదు. హెచ్చెల్సీపై 25 దాకా వంతెనలు, అక్విడెక్ట్‌లు, యూటీలు శిథిలావస్థకు చేరుకున్నాయి. వాటిపై ప్రయాణం ప్రాణాంతకంగా మారిందని వాహనదారులు గగ్గోలు పెడుతున్నారు. వెంటనే మరమ్మతులు చేయాలని కోరుతున్నా పట్టించుకునే నాథుడే లేడు. కొత్త వంతెనల నిర్మాణానికీ ప్రభుత్వం నిధులు మంజూరు చేయడం లేదు. కాలువలో నీటి ప్రవాహ వేగానికి శిథిల వంతెనలు ఎప్పుడు కూలిపోతాయోనని వాహనదారులు బిక్కుబిక్కుమంటూ ప్రయాణిస్తున్నారు.

Updated Date - 2023-11-23T03:03:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising