ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

AP News: 14 వరకు ఎండలే

ABN, First Publish Date - 2023-06-09T21:59:12+05:30

ఎండ తీవ్రతకు రాష్ట్రం శుక్రవారం నిప్పుల కొలిమిలా మారింది. జంఘమహేశ్వరపురంలో 44.6 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. ఇంకా అనేకచోట్ల 40 డిగ్రీలు దాటింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖపట్నం: ఎండ తీవ్రతకు రాష్ట్రం శుక్రవారం నిప్పుల కొలిమిలా మారింది. జంఘమహేశ్వరపురంలో 44.6 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. ఇంకా అనేకచోట్ల 40 డిగ్రీలు దాటింది. కాగా రాయలసీమ, కోస్తాల్లో అక్కడక్కడా వర్షాలు కురిశాయి. రాష్ట్రంలో ఈ నెల 14వ తేదీ వరకు ఎండలు, వడగాడ్పులు కొనసాగుతాయని అధికారులు తెలిపారు. నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలో ప్రవేశించిన తరువాత వాతావరణం చల్లబడుతుందన్నారు. రానున్న 24 గంటల్లో కోస్తా, రాయలసీమలో అక్కడక్కడా ఉరుములు, పిడుగులు, ఈదురుగాలులతో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.

కేరళను తాకిన నైరుతి రుతుపవనాలు

వారం రోజుల ఆలస్యంగా గురువారం కేరళలోకి ప్రవేశించిన విషయం తెలిసిందే. దీంతో అక్కడ విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. మరో 48 గంటల్లో కేరళ అంతటా, తమిళనాడు, కర్ణాటకలోని కొన్ని ప్రాంతాల్లో ప్రవేశించే అవకాశాలున్నాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ నెల 1 నాటికే కేరళలోకి ప్రవేశించాల్సిన రుతుపవనాలు.. వాతావరణ మార్పులు, ‘బిపర్జాయ్‌’ తుఫాన కారణంగా లేటుగా ఆ రాష్ట్రాన్ని చేరాయని వాతావరణ నిపుణులు తెలిపారు. రానున్న 24 గంటల్లో ఈశాన్య రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లోకి రుతుపవనాలు ప్రవేశిస్తాయన్నారు

Updated Date - 2023-06-09T21:59:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising