Lokesh Padayatra: ఏపీకి సీఎం కాబోయేది చంద్రబాబే: లోకేష్
ABN, First Publish Date - 2023-02-24T18:50:03+05:30
ఏపీకి సీఎం కాబోయేది చంద్రబాబేనని టీడీపీ నేత నారా లోకేష్ (Nara Lokesh) స్పష్టం చేశారు. జగన్ సర్కార్ రూ.12 లక్షల కోట్ల అప్పు చేసిందని ఆరోపించారు.
తిరుమల: ఏపీకి సీఎం కాబోయేది చంద్రబాబేనని టీడీపీ నేత నారా లోకేష్ (Nara Lokesh) స్పష్టం చేశారు. జగన్ సర్కార్ రూ.12 లక్షల కోట్ల అప్పు చేసిందని ఆరోపించారు. ప్రభుత్వ అప్పునకు రూ.లక్ష 20 వేల కోట్లు వడ్డీకే పోతోందన్నారు. ఎవరు సీఎం అయినా అది వారికి ముళ్ల కిరీటమేనని, చంద్రబాబు మాత్రమే ఏపీని గాడిలో పెట్టగలరని ప్రకటించారు. ఒక యువకుడిగా సమాజంలో మార్పునకు ప్రయత్నిస్తున్నానని తెలిపారు. టీడీపీ హయాంలో చిత్తూరు జిల్లాకు అనేక పరిశ్రమలు తెచ్చామని లోకేష్ గుర్తుచేశారు.
‘‘యువతను ప్రోత్సహించింది టీడీపీ (TDP)నే. పేదరికం లేని రాష్ట్రంగా ఏపీ నెంబర్‌వన్‌గా నిలబడాలనేదే మా ఆకాంక్ష. ప్రజాసమస్యలు తెలుసుకోవాలనే యువగళం పాదయాత్ర (YuvaGalam Padayatra) మొదలుపెట్టాను. ఉద్యోగాల కల్పనే జగన్‌రెడ్డికి నేను ఇచ్చే రిటర్న్ గిఫ్ట్. సీఎం జగన్‌రెడ్డి ఏపీని అప్పులమయం చేశారు. దీని వల్ల ఒక్క పరిశ్రమ కూడా ఏపీకి రావడం లేదు. అభివృద్ధి, సంక్షేమం రెండూ జోడెద్దుల బండి. సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా అవసరం. విద్య, వసతి దీవెన పథకాలంటూ రూ.10 వేలు ఇచ్చి.. అనేక నిబంధనలతో రూ.లక్షల్లో డబ్బులు వసూలుచేస్తున్నారు. మేం అధికారంలోకి వచ్చాక.. పాత విధానం తీసుకొస్తాం’’ అని లోకేష్ ప్రకటించారు.
Updated Date - 2023-02-24T18:50:04+05:30 IST