ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Chandrayan - 3 : భూ కక్ష్య నుంచి చంద్రుడి కక్ష్యలోకి ఎంటర్..

ABN, First Publish Date - 2023-08-01T07:57:21+05:30

చంద్రయాన్ - 3 ప్రయోగంలో మరో కీలక ఘట్టం విజయవంతమైంది. భూ కక్ష నుంచి చంద్రుడి కక్ష్యలోకి చంద్రయాన్ -3 ప్రవేశించింది. ఉపగ్రహంలోని ఇంధనాన్ని 28 నుంచి 31 నిమిషాలు పాటు మండించి లూనార్ అర్బిట్‌లోకి శాస్త్రవేత్తలు పంపించారు. చంద్రుని కక్షలోకి చంద్రయాన్ -3 చేరుకోవడంతో ఇస్రో శాస్త్రవేత్తల్లో ఆనందం చోటు చేసుకుంది.

నెల్లూరు : చంద్రయాన్ - 3 ప్రయోగంలో మరో కీలక ఘట్టం విజయవంతమైంది. భూ కక్ష నుంచి చంద్రుడి కక్ష్యలోకి చంద్రయాన్ -3 ప్రవేశించింది. ఉపగ్రహంలోని ఇంధనాన్ని 28 నుంచి 31 నిమిషాలు పాటు మండించి లూనార్ అర్బిట్‌లోకి శాస్త్రవేత్తలు పంపించారు. చంద్రుని కక్షలోకి చంద్రయాన్ -3 చేరుకోవడంతో ఇస్రో శాస్త్రవేత్తల్లో ఆనందం చోటు చేసుకుంది.

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) గత నెల 14వ తేదీన చంద్రయాన్‌-3 (Chandrayaan-3)ని విజయవంతంగా ప్రయోగించింది. చంద్రయాన్ -3 ఉపగ్రహాన్ని నిర్దేశిత కక్ష్యలోకి ఎల్వీఎం-3 ఎం-4 రాకెట్ ప్రవేశపెట్టింది. చంద్రుని (Moon) దక్షిణ ధ్రువంపై ఎవరూ చూడని నిగూఢ రహస్యాలను ఛేదించే చంద్రయాన్‌-3 ప్రయోగాన్ని ఇస్రో శాస్త్రవేత్తలు చేపట్టారు. శ్రీహరికోటలోని సతీష్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ (షార్‌) ఈ ప్రయోగానికి వేదికైంది.

చంద్రయాన్ - 3 రాకెట్‌ ద్వారా 3,900 కిలోల బరువున్న చంద్రయాన్‌-3 పేలోడ్‌ను రోదసీలోకి పంపారు. రాకెట్‌ నుంచి విడిపోయాక వ్యోమనౌకను భూకక్ష్య నుంచి చంద్రుని కక్ష్య వరకూ మోసుకెళ్లే ప్రొపల్షన్‌ మాడ్యూల్‌, అక్కడి నుంచి చంద్రునిపై దిగిన తర్వాత పరిశోధనలు చేసేందుకు విక్రమ్‌ ల్యాండర్‌, ఉపరితలంపై తిరుగుతూ పరిశోధనలు చేపట్టే ప్రగ్యాన్‌ రోవర్‌ చంద్రయాన్‌-3లో ఉన్నాయి. ఇక ఈ వ్యోమనౌక దాదాపు 40 రోజులపాటు అంతరిక్షంలో ప్రయాణించి చివరికి ఆగస్టు 23 లేదా 24న చంద్రుడిపై దిగనుంది.

Updated Date - 2023-08-01T08:22:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising