.. ఇట్లు మన కుప్పం
ABN, First Publish Date - 2023-05-03T01:24:45+05:30
జిల్లాలోని మారుమూల ప్రాంతమైన కుప్పం.. పలు ప్రముఖ చారిత్రక పర్యాటక ప్రదేశాలకు ప్రసిద్ది చెందింది.
కుప్పం, మే 2: జిల్లాలోని మారుమూల ప్రాంతమైన కుప్పం.. పలు ప్రముఖ చారిత్రక పర్యాటక ప్రదేశాలకు ప్రసిద్ది చెందింది. ఒకప్పుడు కంగుంది సంస్థానాన్ని పాలించిన జమీందార్లు కోటలు, రాజ భవనాలు నిర్మించారు. ఇటువంటి చారిత్రక ప్రదేశాలకు చిత్రలేఖనంలో ఒక రూపునిచ్చి, ప్రత్యేకంగా ఒక అల్బమ్ రూపొందించడానికి నడుం కట్టారు స్థానిక చిత్ర కళాకారుడు పురుషోత్తం. బతుకుదెరువు వెదక్కుంటూ ప్రస్తుతం హైదరాబాదు చేరినా.. తనకొచ్చిన చిత్రకళతో జన్మభూమి రుణం తీర్చుకునేందుకు సిద్ధమయ్యారు. ‘ఇట్లు మన కుప్పం’ పేరుతో పర్యాటక ప్రాంతాల చిత్రాలు చిత్రించి అల్బమ్ తయారు చేయడానికి సంకల్పించారు. తొలుత అల్బమ్‌కు ముఖచిత్రంగా కుప్పంలోని రాజావారి ప్యాలె్‌సతోపాటు చివరి జమీందారీ పాలకుడైన రాజా వెంకటపతినాయుడు చిత్రాన్ని రూపొందించారు. ఇలా రూపొందించిన ఆల్బమ్‌ను ఈనెల 10వ తేదీన ప్రసార మాధ్యమాలలో విడుదల చేయనున్నట్లు చిత్రకారుడు పురుషోత్తం తెలిపారు.
Updated Date - 2023-05-03T01:24:45+05:30 IST