ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ఘనంగా ఏఐటీయూసీ ఆవిర్భావ దినోత్సవం

ABN, First Publish Date - 2023-11-01T01:25:30+05:30

జిల్లాలో ఏఐటీయూసీ ఆవిర్భావ దినోత్సవాన్ని మంగళవారం ఘనంగా నిర్వహించారు.

చిత్తూరు ప్రభుత్వాస్పత్రిలో జెండా ఎగురవేస్తున్న నాగరాజు

చిత్తూరు రూరల్‌, అక్టోబరు 31: జిల్లాలో ఏఐటీయూసీ ఆవిర్భావ దినోత్సవాన్ని మంగళవారం ఘనంగా నిర్వహించారు. చిత్తూరులో జరిగిన కార్యక్రమంలో యూనియన్‌ జిల్లా గౌరవాధ్యక్షుడు నాగరాజు మాట్లాడుతూ భారతదేశానికి స్వాతంత్య్రం రాకముందే 1920 అక్టోబరు 31న ఏఐటీయూసీ ఆవిర్భావం జరిగిందన్నారు. కార్మికుల సంక్షేమం కోసం రాజీ లేని పోరాటం చేసిందన్నారు. చిత్తూరు ప్రభుత్వాస్పత్రిలో, ప్రకాశం హైరోడ్‌, యూనియన్‌ ప్రాంగణంలో, ఆటో స్టాండ్‌లో ఏఐటీయూసీ జెండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్‌ నాయకులు వెంకటేశు, చంద్ర, రవిచంద్ర తదితరులు పాల్గొన్నారు.

విజయపురం: విజయపురంలో ఏఐటీయూసీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జెండా ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ కార్యదర్శి కోదండయ్య, ఆశావర్కర్‌ యూనియన్‌ రాష్ట్ర మాజీ అధ్యక్షురాలు సుజాత, నాయకులు జాన్సీ, జయమ్మ, గోవిందస్వామి, చెంచురామయ్య, ఏసుపాదం, సురేఖ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-11-01T01:25:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising