ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Tirupati: ఎస్వీ జంతు ప్రదర్శనశాలలో మరో సింహం మృతి

ABN, Publish Date - Dec 22 , 2023 | 08:09 AM

తిరుపతి: శ్రీవేంకటేశ్వర జంతు ప్రదర్శనశాలలో మరో సింహం మృతి చెందింది. ప్రస్తుతం చనిపోయిన సింహం వయసు 23 సంవత్సరాలని, వృద్ధాప్యం కారణంగా మృతిచెందినట్లు క్యూరేటర్ సెల్వం వెల్లడించారు.

తిరుపతి: శ్రీవేంకటేశ్వర జంతు ప్రదర్శనశాలలో మరో సింహం మృతి చెందింది. ప్రస్తుతం చనిపోయిన సింహం వయసు 23 సంవత్సరాలని, వృద్ధాప్యం కారణంగా మృతిచెందినట్లు క్యూరేటర్ సెల్వం వెల్లడించారు. ఇటీవల జన్యు సంబంధిత కారణాలతో అనురాగ్ అనే సింహం మృతి చెందిన విషయం తెలిసిందే. వరుస సింహాల మరణాల నేపథ్యంలో జూ అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు.

కాగా నాలుగు రోజుల క్రితం ఆదివారం ఎస్వీ జంతు ప్రదర్శనశాలలో అనురాగ్‌ అనే మగ సింహం (7) మృతి చెందింది. ఏడేళ్ల క్రితం జూ పార్క్ లోనే మూడు సింహాలు పుట్టాయి. ఆ 3 సింహల్లో ఒకటైన మగ సింహానికి అనురాగ్ అనే పెట్టారు. ఇది పుట్టినప్పటి నుంచి జన్యుపరమైన సమస్యలతో ఇబ్బంది పడుతోంది. వయసుకు తగ్గ బరువు, పొడవు లేకపోవడం, కుడి కంటి చూపు కోల్పోవడం, ఇతర అనారోగ్య సమస్యల వల్ల దాన్ని ప్రదర్శనకు ఉంచలేదని జూ అధికారులు పేర్కొన్నారు. చిన్నతనం నుంచి వైద్య సేవలను జూ ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది అందిస్తున్నా కోలుకోలేక పోయిందని చెప్పారు. సాధార‌ణంగా సింహాలు 15-20 ఏళ్లు జీవిస్తాయని అధికారులు తెలిపారు.

Updated Date - Dec 22 , 2023 | 08:09 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising