గంజాయి ముఠాపై దాడులు
ABN, First Publish Date - 2023-05-08T00:39:37+05:30
ఆరుగురి అరెస్టు, పరారీలో ఒకరు 2.3 కిలోల గంజాయి, మూడు ఫోన్లు, వెయ్యి రూపాయల స్వాధీనం
చంద్రగిరి, మే 7: గంజాయి ముఠాపై పోలీసులు దాడులు నిర్వహించి, ఆరుగురిని అరెస్ట్ చేశారు. ఒకరు పరారయ్యారు. పట్టుబడ్డ వారి వద్ద నుంచి 2.3 కిలోల గంజాయి, మూడు సెల్‌ఫోన్లు, వెయ్యి రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. ఆదివారం చంద్రగిరి పోలీస్ స్టేషన్‌లో సీఐ ఓబులేసు మీడియాకు వివరాలు తెలిపారు. చంద్రగిరి మండలం తొండవాడ నుంచి శానంబట్ల వెళ్లేదారిలోని జీబీఎస్ కల్యాణ మండపం సమీపంలో ఖాళీ స్థలంలో గంజాయి విక్రయాలు జరుగుతున్నాయని పోలీసులకు సమాచారం అందింది. దాంతో ఎస్పీ పరమేశ్వరరెడ్డి సూచనలతో ఎస్‌ఈబీ అడిషనల్ ఎస్పీ, చంద్రగిరి డీఎస్పీ యశ్వంత్ ఆధ్వర్యంలో సీఐ ఓబులేసు, ఎస్‌ఐలు వంశీధర్, హిమబిందు తమ సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అక్కడ ఏడుగురు ముఠాగా ఉండటంతో వారిపై దాడులు చేశారు. ఒకరు పరారవగా, ఆరుగురిని అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 2.3 కిలోల గంజాయి, మూడు సెల్‌ఫోన్లు, రూ.వెయ్యి స్వాధీనం చేసుకున్నారు. అరెస్టు అయిన వారిలో.. కరకంబాడికి చెందిన కారపురెడ్డి సంజయ్‌రెడ్డి, అన్నమయ్య జిల్లా బండపురెడ్డివారిపల్లెకు చెందిన బండపురెడ్డి దొరబాబురెడ్డి, కలికిరికి చెందిన జంగం సత్య, తిరుపతి కొర్లగుంటకు చెందిన షేక్ యూనస్, చెన్నై అంబూర్‌కు చెందిన కుట్టి సతీ్‌షలతోపాటు ఓ బాలుడు ఉన్నాడు. పరారైన వ్యక్తి తిరుపతి రూరల్ మండలం లక్ష్మీచెరువుకు చెందిన షేక్ సంపత్‌గా గుర్తించారు. కాగా.. సంజయ్‌రెడ్డి తిరుచానూరుకు చెందిన రియాజ్, నెల్లూరుకు చెందిన శ్యామూల్ వద్ద గంజాయి తక్కువ ధరకు కొనుగోలు చేసి, ఎక్కువ ధరలకు విక్రయిస్తున్నట్లు సీఐ తెలిపారు. ఇక సత్యం, బాలుడు, పరారైన షేక్ సంపత్‌లపై తిరుపతి ఈస్ట్, అలిపిరి, ఎంఆర్‌పల్లె, సీసీఎస్ పోలీస్ స్టేషన్లలో పలు కేసులు ఉన్నాయన్నారు. పరారీలోని సంపత్, గంజాయి ప్రధాన స్మగ్లర్లు రియాజ్, శ్యామూల్ కోసం ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నట్లు వివరించారు. ఈదాడుల్లో చంద్రగిరి పోలీసులు పాల్గొన్నారు.
Updated Date - 2023-05-08T00:39:37+05:30 IST