ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Chandrababu: అందుకే జీవో నెం.1 తీసుకువచ్చారు..

ABN, First Publish Date - 2023-01-14T11:59:34+05:30

చిత్తూరు: ప్రజావేదిక ధ్వంసంతో జగన్మోహన్ రెడ్డి పాలన మొదలుపెట్టారని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు విమర్శించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చిత్తూరు: ప్రజావేదిక ధ్వంసంతో జగన్మోహన్ రెడ్డి (Jaganmohanreddy) పాలన మొదలుపెట్టారని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) విమర్శించారు. భోగి (Bhogi), సంక్రాంతి (Sankranthi) సందర్భంగా నారావారిపల్లి (Naravaripalli)కి వచ్చిన ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ ప్రజలపై ఛార్జీలు, పన్నులతో మోత మోగిస్తున్నారని, రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలకు టీడీపీనే నాంది పలికిందన్నారు. కందుకూరు, గుంటూరు తొక్కిసలాటల్లో ప్రభుత్వం కుట్ర ఉందని, తనను ప్రజలతో కలవనీయకుండా జీవో నెం.1 తీసుకువచ్చారని ఆరోపించారు. ఆనందంగా ఉండాల్సిన పండగవేళ ప్రజలు నిరాశతో ఉన్నారని, రాష్ట్రంలో వ్యవస్థలన్నీ అవినీతిమయం అయ్యాయని, వైసీపీ నేతల ఇసుక మాఫీయాతో నిర్మాణ రంగం కుప్పకూలిందన్నారు. పారిశ్రామికవేత్తలు ఏపీకి రావాలంటేనే భయపడుతున్నారని చంద్రబాబు అన్నారు.

తిరుమల కొండపై అనేక అపచారాలు జరుగుతున్నాయని, శ్రీవారికి అపచారం చేస్తే ఈ జన్మలోనే శిక్ష తప్పదని చంద్రబాబు హెచ్చరించారు. కొండపై వ్యాపార ధోరణితో గదుల రేట్లు భారీగా పెంచారని, శ్రీవారి ప్రసాదం క్వాలిటీని తగ్గించారని అన్నారు. తెలుగుదేశం పార్టీ పేదవారి కోసం పని చేస్తుందని స్పష్టం చేశారు. మధ్యంతర ఎన్నికలంటున్నారని, ఎన్నికలు ఎప్పుడు వ

చ్చినా.. జగన్ ఇంటికి పోవడం ఖాయమని అన్నారు. రాష్ట్రంలో రైతులు మూడేళ్ళుగా బాగా చితికిపోయారని.. దేశంలో ఎక్కువ అప్పుల్లో రైతాంగం ఉందని.. ఆత్మహత్యలు చేసుకునే రైతాంగం ఏపీలో ఉందని చంద్రబాబు అన్నారు.

Updated Date - 2023-01-14T11:59:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising