ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

చిత్తూరు అసెంబ్లీ జనసేనకు?

ABN, First Publish Date - 2023-09-16T01:44:16+05:30

టీడీపీతో పొత్తు ఖాయమని జనసేన నేత పవన్‌కల్యాణ్‌ ప్రకటించడంతో జిల్లాలో వారికి కేటాయించే అవకాశం ఉన్న నియోజకవర్గంగా చిత్తూరు మీద చర్చ అప్పుడే మొదలైంది.

చిత్తూరు, సెప్టెంబరు 15 (ఆంధ్రజ్యోతి): టీడీపీతో పొత్తు ఖాయమని జనసేన నేత పవన్‌కల్యాణ్‌ ప్రకటించడంతో జిల్లాలో వారికి కేటాయించే అవకాశం ఉన్న నియోజకవర్గంగా చిత్తూరు మీద చర్చ అప్పుడే మొదలైంది. ఇందుకు ప్రధాన కారణం జిల్లాలో టీడీపీ ఇన్‌ఛార్జిని ఇప్పటికీ నియమించని నియోజకవర్గం చిత్తూరు మాత్రమే కావడం. ఈ క్రమంలో చిత్తూరు అసెంబ్లీ నుంచి ఉమ్మడి అభ్యర్థిగా ఎవరు పోటీ చేయనున్నారనే అంశం తెర మీదకు వచ్చింది. స్వర్గీయ మాజీ ఎమ్మెల్యే సత్యప్రభ కుటుంబాన్ని ఇప్పటికే అటు వైసీపీ, ఇటు టీడీపీ నాయకులు పలుమార్లు కలిశారు. వారి నుంచి స్పష్టత రాలేదు. ఈ కుటుంబానికి మెగాస్టార్‌ చిరంజీవి కుటుంబంతో దశాబ్దాల నుంచీ మంచి సాన్నిహిత్యం ఉంది. కరోనా సమయంలో సత్యప్రభ మరణించినపుడు, చిరంజీవి కుమారుడు రామ్‌చరణ్‌ బెంగళూరులో ఆమె అంత్యక్రియలకు హాజరయ్యారు. ఈ క్రమంలో ఆ కుటుంబం వచ్చే ఎన్నికల్లో జనసేన నుంచి పోటీ చేసే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. చిత్తూరు నుంచి టీడీపీ ఆశావహుల్లో మాజీ మేయర్‌ కటారి హేమలత పేరు ప్రధానమైనది. పార్టీ కార్యక్రమాల్లో ఆమె యాక్టివ్‌గా ఉంటున్నారు. కరోనా లాక్‌డౌన్‌ కాలంలో నగర ప్రజలకు పలురకాల సేవా కార్యక్రమాలతో దగ్గరైన పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు కాజూరి బాలాజీ కూడా టికెట్‌ ఆశిస్తున్నారు. జడ్పీ మాజీ చైర్‌పర్సన్‌ గీర్వాణి భర్త చంద్రప్రకాష్‌ పేరు కూడా వినిపిస్తోంది. పార్టీ కార్యక్రమాల్లో ఆయన మళ్లీ కనిపిస్తున్నారు. ఇక గుడిపాల మండలానికి చెందిన టీడీపీ నేత గురజాల జగన్‌మోహన్‌ ఆ మధ్య టీడీపీ అధినేత చంద్రబాబును కలిసి టికెట్‌ ఇస్తే ఎంత ఖర్చు పెట్టయినా గెలుచుకుని వస్తానని హామీ ఇచ్చారు. కొన్నాళ్లుగా జీజేఎం ట్రస్టు పేరిట చిత్తూరు నగరంతో పాటు గుడిపాల మండలంలో పలు సేవా కార్యక్రమాలు చేస్తూ మళ్లీ పార్టీలో యాక్టివ్‌ అయ్యారు. మరోవైపు మాజీ ఎమ్మెల్యే సీకే బాబు దంపతులు కూడా టీడీపీ టికెట్‌ ఆశిస్తున్నారనే ప్రచారం బలంగా ఉంది. ఈ నేపథ్యంలో జనసేనకు కేటాయిస్తే ఎవరు తెరమీదకు వస్తారు? వీరిలోని వారే జనసేన అభ్యర్థిగా మారతారు? టీడీపీ స్వయంగా పోటీచేస్తే ఎవరికి టికెట్‌ దక్కుతుందనే అంశంపై రకరకాల ఊహాగానాలు సాగుతున్నాయి. అయితే మరికొంత కాలం గడిస్తే గానీ స్పష్టత వచ్చే అవకాశం లేదు.

Updated Date - 2023-09-16T01:45:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising