కూల్.. కూల్..
ABN, First Publish Date - 2023-03-11T01:38:21+05:30
ఎస్వీ జూపార్కులో వన్య ప్రాణుల సంరక్షణపై అధికారులు దృష్టి సారించారు. పులులు, సింహాలు, జాగ్వార్, చిరుతల ఎన్‌క్లోజర్స్ వద్ద గ్రీన్ కలర్ క్లాత్, నీటిని వెదజల్లే స్ర్పింక్లర్స్ ఏర్పాటు చేశారు.
తిరుపతి అర్బన్, మార్చి 10 : భానుడి తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. అందుకే ఎస్వీ జూపార్కులో వన్య ప్రాణుల సంరక్షణపై అధికారులు దృష్టి సారించారు. రూ.4 లక్షలు వెచ్చించి సంరక్షణ చర్యలు చేపట్టారు. పులులు, సింహాలు, జాగ్వార్, చిరుతల ఎన్‌క్లోజర్స్ వద్ద గ్రీన్ కలర్ క్లాత్, నీటిని వెదజల్లే స్ర్పింక్లర్స్ ఏర్పాటు చేశారు. నైట్ హౌస్‌కి కూల్ పెయింట్ వేయిస్తున్నారు. పక్షుల కోసం ఫీజర్ ట్రీ, కూలర్లు, వట్టి వేర్ల మ్యాట్లు ఏర్పాటు చేస్తున్నారు. గజరాజులకు వర్షం పడుతున్నట్లుగా స్ర్పింక్లర్స్ ఏర్పాటు చేశారు. దుప్పులు, కృష్ణజింకలు, కణితులు, అడవి దున్నలు, అడవి పందుల ఎన్‌క్లోజర్స్ వద్ద వట్టి వేర్లతో తెరలను ఏర్పాటు చేశారు. బురద గుంటలను ఏర్పాటు చేశారు.
Updated Date - 2023-03-11T01:38:21+05:30 IST