Kuppam: కుప్పానికి పొంచి ఉన్న ప్రమాదం... అధికారుల హై అలర్ట్..
ABN, First Publish Date - 2023-12-11T13:54:49+05:30
చిత్తూరు జిల్లా కుప్పానికి ఏనుగుల ప్రమాదం పొంచి ఉంది. తమిళనాడు రాష్ట్రం హోసూర్ నుంచి కుప్పం వైపు 70 ఏనుగుల గుంపు తరలివస్తోంది. రాత్రి తమిళనాడు హోసూరు సరిహద్దులో 70 ఏనుగుల గుంపు హల్‌చల్ చేసింది.
చిత్తూరు: చిత్తూరు జిల్లా కుప్పానికి ఏనుగుల ప్రమాదం పొంచి ఉంది. తమిళనాడు రాష్ట్రం హోసూర్ నుంచి కుప్పం వైపు 70 ఏనుగుల గుంపు తరలివస్తోంది. రాత్రి తమిళనాడు హోసూరు సరిహద్దులో 70 ఏనుగుల గుంపు హల్‌చల్ చేసింది. కుప్పం సరిహద్దు గ్రామాల్లో అటవీశాఖ అధికారులు హై అలర్ట్ ప్రకటించారు. గ్రామ సరిహద్దుల్లో, పొలాల్లో రాత్రి పూట ప్రజలు ఉండకూడదని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో కుప్పం అటవీ శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు.
Updated Date - 2023-12-11T13:55:10+05:30 IST