ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గేటుకు తాళం వేసినా..!

ABN, First Publish Date - 2023-04-06T01:42:03+05:30

రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సభ నుంచీ మహిళలు బయటకు వెళ్లిపోయారు. ప్రధాన గేటుకు తాళం వేసినా గోడ దూకి వచ్చారు. చౌడేపల్లె ఎంపీడీవో కార్యాలయంలో బుధవారం వైఎ్‌సఆర్‌ ఆసరా చెక్కుల పంపిణీకి అధికారులు, వైసీపీ నాయకులు ఘనంగా ఏర్పాట్లు చేశారు.

మంత్రి పెద్దిరెడ్డి మాట్లాడుతుండగానే గేట్లు, గోడ దూకి వెళ్లిపోతున్న మహిళలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

పుంగనూరు, ఏప్రిల్‌ 5: రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సభ నుంచీ మహిళలు బయటకు వెళ్లిపోయారు. ప్రధాన గేటుకు తాళం వేసినా గోడ దూకి వచ్చారు. చౌడేపల్లె ఎంపీడీవో కార్యాలయంలో బుధవారం వైఎ్‌సఆర్‌ ఆసరా చెక్కుల పంపిణీకి అధికారులు, వైసీపీ నాయకులు ఘనంగా ఏర్పాట్లు చేశారు. మంత్రి పెద్దిరెడ్డి పుంగనూరులో రెండు సభలు, కార్యక్రమాలు పూర్తిచేసుకుని రెండు గంటలు ఆలస్యంగా మధ్యాహ్నం 12.30 గంటల వచ్చారు. అప్పటికే భారీగా జనం వచ్చారు. సభలో మంత్రి పెద్దిరెడ్డి ప్రసంగిస్తుండగానే మరోవైపు మహిళలు వేచిచూడలేక ఇళ్లదారి పట్టారు. సభ పూర్తయ్యే వరకు ఎవరూ సభనుంచి బయటకు వెళ్లకుండా ఎంపీడీవో కార్యాలయ ప్రధాన గేట్లకు తాళాలు వేశారు. ఉదయం వచ్చిన మహిళలు సభలో ఉండలేక తిరుగుపయనం కాగా చౌడేపల్లె ఎస్‌ఐ రవికుమార్‌ గేటు వద్దకు వచ్చి వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయినా ఫలితంలేక పోయింది. గేటుకు తాళం వేయగా కొందరు గేట్లు ఎక్కి, మరి కొందరు పక్కనే ఉన్న గోడ ఎక్కి దూకి ఇళ్లకు వెళ్లారు. మంత్రి ప్రసంగం పూర్తయ్యేవరకు మహిళలు సభలో ఉండాలని పలుమార్లు చెబుతున్నా చాలామంది గేట్లు ఎక్కి వెళ్లారు. ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది.

Updated Date - 2023-04-06T01:42:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising