ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ఆస్పత్రి నుంచి ఇంటికెళుతూ..!

ABN, First Publish Date - 2023-09-16T01:43:32+05:30

ఆయిల్‌ ట్యాంకరును ఢీకొన్న అంబులెన్సు ఐదుగురు ఒడిశావాసుల దుర్మరణం ఇద్దరికి తీవ్ర గాయాలు తెల్లగుండ్లపల్లెలో ప్రమాదం

ప్రమాదస్థలాన్ని పరిశీలిస్తున్న పోలీసులు

తవణంపల్లె, సెప్టెంబరు 15 (ఆంధ్రజ్యోతి): బెంగళూరులో మెరుగైన చికిత్సపొంది డిశ్చార్జి అయ్యారు. భువనేశ్వర్‌కు అంబులెన్సులో బయలుదేరారు. ఆరోగ్యవంతుడిగా చేసుకుని ఇంటికి వెళుతున్నామన్న ఆనందంలో అతడి భార్య, బంధువులు ఉన్నారు. కానీ, డ్రైవరుకు కునుకు రూపంలో వీరిని మృత్యువు వెన్నాడింది. ఆగి ఉన్న ట్యాంకరును ఈ అంబులెన్సు ఢీకొంది. ఈ ఘటనతో అంబులెన్సులో ఉన్న డ్రైవరు సహా ఏడుగురిలో ఐదుగురు దుర్మరణం చెందారు. ఈ విషాద ఘటన శుక్రవారం వేకువజామున తవణంపల్లె మండలం తెల్లగుండ్లపల్లె సమీపంలోని జాతీయ రహదారిపై జరిగింది.

ఒడిశా రాష్ట్రం భువనేశ్వర్‌కు చెందిన ఉమే్‌షచంద్‌ సాహు (46) అనారోగ్య కారణంగా బెంగుళూరులోని విక్టోరియా ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నారు. డిశ్చార్జి అనంతరం భార్యతో పాటు బంధువులతో కలిసి అంబులెన్సులో సొంత ప్రాంతానికి బయల్దేరారు. సరిగ్గా శుక్రవారం తెల్లవారుజామున 4:20 గంటలకు చిత్తూరు బైపాస్‌, తవణంపల్లె మండలం తెల్లగుండ్లపల్లె సమీపంలోని హైవే వద్దకు మీదకు వీరి అంబులెన్సు చేరుకుంది. అదే సమయంలో బెంగుళూరు నుంచి ఒంగోలు వెళ్తున్న ఆయిల్‌ ట్యాంకర్‌ రోడ్డుపక్కన ఆగి ఉంది. ఈ ట్యాంకరును వెనుక వైపు నుంచి వేగంగా వస్తూ అంబులెన్సు ఢీకొంది. ఈ ప్రమాదాన్ని చూసి సమీప దాబా నిర్వాహకులు వెంటనే పోలీసులకు సమాచారాన్ని అందించారు. ఈ ఘటనలో అంబులెన్సులో ఉన్న ఉమే్‌షచంద్‌తో పాటు అతడి భార్య రష్మిత సాహు (45), బంధువులు బిజయ్‌ నాయర్‌ (56), తిలోచన నాయర్‌ (63) అక్కడికక్కడే మృతి చెందారు. డ్రైవర్‌ సంజయ్‌కుమార్‌ జారా (43), జతిన్‌కుమార్‌ సాహు (30), దేబా బట్ట (24)కు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను పోలీసులు చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. శవపరీక్షల కోసం మృతదేహాలను కూడా అక్కడికే చేర్చారు. గాయపడిన వారిలో డ్రైవర్‌ సంజయ్‌ పరిస్థితి విషమించడంతో వేలూరుకు తరలిస్తుండగా, మార్గమధ్యలో అతడూ మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య ఐదుకు చేరింది. ప్రమాదం గురించి మృతుల బంధువులకు పోలీసులు సమాచారాన్ని అందించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చిత్తూరు వెస్ట్‌ సీఐ శివశంకర్‌రెడ్డి తెలిపారు. కాగా, అంబులెన్సు డ్రైవర్‌ నిద్ర మత్తు కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. ప్రమాదంలో నుజ్జయిన అంబులెన్సును జేసీబీ సాయంతో హైవే పక్కకు తీశారు. ఆయిల్‌ ట్యాంకర్‌ డ్రైవర్‌, క్లీనర్‌ పోలీసులకు లొంగిపోయారు. ట్యాంకర్‌ కూడా తవణంపల్లె పోలీ్‌సస్టేషన్‌లో ఉంది.

భాష తెలియక..

తీవ్రగాయాలతో బయట పడిన జతిన్‌కుమార్‌ సాహు, దేబా బట్ట ఆవేదన గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. తమ కుటుంబ సభ్యులు నలుగురు చనిపోయారు. మృతదేహాలు తమ కళ్ల ముందే పడి ఉన్నాయి. వారికీ తీవ్రంగా గాయాలయ్యాయి. ఓ వైపు తమకు కలిగిన గాయాల నొప్పి.. మరోవైపు కుటుంబ సభ్యులు నిర్జీవంగా కళ్ల ముందు పడిఉన్న బాధ.. ఈ రెండింటి గురించి చెప్పుకుందామంటే భాష తెలీదు. సైగలతో కాసింతగా పరిస్థితిని వివరించాల్సి వచ్చింది. పోలీసులు కూడా కష్టమ్మీద వారి వివరాలు తెలుసుకుని బంధువులకు సమాచారం అందించారు.

Updated Date - 2023-09-16T01:43:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising