ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

చూశారా.. ఇసుక దోపిడీ

ABN, First Publish Date - 2023-11-28T01:54:18+05:30

‘ప్రజలారా.. చూశారా ఈ ఇసుక దోపిడీ. మరీ ఇంత బహిరంగంగా ఇసుకను తరలిస్తుంటే అధికారులు ఏం చేస్తున్నారు? వారి కళ్లకు కనిపిస్తోందా.. లేదా..’ అని మాజీ మంత్రి అమరనాథరెడ్డి ప్రశ్నించారు.

అక్రమంగా తరలుతున్న ఇసుకను పరిశీలిస్తున్న అమరనాథ రెడ్డి

ఇంత బహిరంగంగా తరలిస్తుంటే అధికారులు ఏం చేస్తున్నట్లో?

మాజీ మంత్రి అమర్‌ ప్రశ్న

గంగవరం, నవంబరు 27: ‘ప్రజలారా.. చూశారా ఈ ఇసుక దోపిడీ. మరీ ఇంత బహిరంగంగా ఇసుకను తరలిస్తుంటే అధికారులు ఏం చేస్తున్నారు? వారి కళ్లకు కనిపిస్తోందా.. లేదా..’ అని మాజీ మంత్రి అమరనాథరెడ్డి ప్రశ్నించారు. గంగవరం మండలంలోని మేలుమాయి పంచాయతీ పరిధిలోని జె.కొత్తూరు, గుండ్లపల్లె, హరిజనవాడ, మేలుమాయి, మబ్బువాళ్లపేట, చిన్నమనాయని పల్లె గ్రామాల్లో సోమవారం ‘బాబు ష్యూరిటీ- భవిష్యత్తుకు గ్యారెంటీ’ కార్యక్రమంలో భాగంగా ఆయన ఇంటింటా పర్యటించారు. చిన్నమనాయనిపల్లె అమర్‌ మాట్లాడుతుండగా ఇసుక ట్రాక్టర్లు వస్తుండటం చూసి ఆయన స్పందించారు. ఇసుక అక్రమ రవాణాను అధికారులు పట్టించుకోవడంలేదని మండిపడ్డారు. ఈ ప్రభుత్వంలో మన్ను, ఇసుక, జల్లి.. ఇలా ఏది దొరికితే అది దోచుకోవడమే వారిపని అని ఆరోపించారు. ప్రజావ్యతిరేక విధానాలకు పాల్పడుతున్న ఈ ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయని జోస్యం చెప్పారు. ఒక్కసారి అవకాశం ఇవ్వండంటూ అధికారంలోకి వచ్చిన వీరు ప్రజలకు నరకాన్ని చూపించేలా రోడ్లను తయారు చేశారంటూ మండిపడ్డారు. కనీసం మట్టివేయలేని దుస్థితిలో మన పాలకులు ఉన్నారంటే ఇలాంటి దౌర్బాగ్య పరిస్థితిని మీరు ఎప్పుడైనా చూశారా అని స్థానికులను అడిగారు. టీడీపీ అధికారంలోకి రాగానే ఆగిన రోడ్ల పనులన్నీ పూర్తి చేస్తామన్నారు. గుండ్లపల్లెలో వైసీపీకి చెందిన బాలాజి, ప్రతా్‌పరెడ్డి టీడీపీలో చేరారు. గుండ్లపల్లెకు చెందిన జయరామరెడ్డి కుమార్తెలు గీతిక, షాలిని హుండీలో దాచుకుని ఉన్న సొమ్మును టీడీపీకి విరాళంగా అమరనాథ రెడ్డికి అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల టీడీపీ అధ్యక్షుడు సోమశేఖర్‌గౌడ్‌, వెంకట్రామిరెడ్డి, విష్ణువర్ధన్‌రెడ్డి, ప్రతా్‌పరెడ్డి, మురళి, రవి, యుగంధర్‌, రెడ్డెప్ప, అమరనాథరెడ్డి, రామ్మోహన్‌నాయుడు, రహీం, ముబారక్‌, శ్రీనివాసులు, రమే్‌షరెడ్డి, శీనప్ప, జనసేన నాయకులు పసుపులేటి దిలీప్‌, చంద్ర, నాగరాజు పాల్గొన్నారు.

Updated Date - 2023-11-28T01:54:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising