ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జ్యోతిరావుఫూలే స్ఫూర్తితో పనిచేయాలి

ABN, First Publish Date - 2023-04-12T02:04:02+05:30

మహాత్మా జ్యోతిరావు ఫూలే స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ పనిచేయాలని కలెక్టర్‌ షన్మోహన్‌ పిలుపునిచ్చారు.

జ్యోతిరావు ఫూలే విగ్రహానికి పూలమాల వేస్తున్న కలెక్టర్‌, ఎమ్మెల్యే
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

చిత్తూరు, ఏప్రిల్‌ 11: మహాత్మా జ్యోతిరావు ఫూలే స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ పనిచేయాలని కలెక్టర్‌ షన్మోహన్‌ పిలుపునిచ్చారు. మంగళవారం ఫూలే 197వ జయంతి సందర్భంగా చిత్తూరులోని పీసీఆర్‌ ప్రభుత్వ పాఠశాల సమీపంలో ఉన్న విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించాక ఆయన విలేకరులతో మాట్లాడారు. ఫూలే నేర్పిన పాఠాలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు చేసిన సేవలను స్ఫూర్తిగా తీసుకుని అధికారులు, ప్రజా ప్రతినిధులందరూ పనిచేయాలన్నారు. అంబేడ్కర్‌ రచించిన రాజ్యాంగంలో బీసీలకు సమాన హక్కులు ఉన్నాయంటే అందులో జ్యోతిరావు ఫూలే కృషి ఎంతో ఉందని జడ్పీ చైర్మన్‌ శ్రీనివాసులు, ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు పేర్కొన్నారు. వీరితోపాటు మేయర్‌ అముద, చుడా చైర్మన్‌ పురుషోత్తంరెడ్డి, రాష్ట్ర మొదలియార్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ బుల్లెట్‌ సురేష్‌ తదితరులు జ్యోతిరావు ఫూలే విగ్రహానికి నివాళులర్పించారు. జిల్లా సాంఘిక సంక్షేమం, సాధికారిత అధికారిణి రాజ్యలక్ష్మి, బీసీ సంఘాల నేతలు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2023-04-12T02:04:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising