ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వడదెబ్బకు ఉపాధి కూలీ మృతి

ABN, First Publish Date - 2023-05-16T00:55:03+05:30

వడదెబ్బకు ఉపాధి కూలీ కరుణాకరన్‌(43) సోమవారం మృతి చెందారు.

కరుణాకర్‌ మృతదేహాన్ని పరిశీలిస్తున్న వైద్యాధికారి, ఎస్‌ఐ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయపురం, మే 15: వడదెబ్బకు ఉపాధి కూలీ కరుణాకరన్‌(43) సోమవారం మృతి చెందారు. పోలీసులు తెలిపిన ప్రకారం.. విజయపురం అడవిలో కందకాలు తవ్వడానికి ఉదయం 6 గంటలకు కరుణాకరన్‌ వెళ్లారు. ఉపాధి పని చేస్తుండగా 8.30 గంటల ప్రాంతంలో అలసటగా ఉందని, ఛాతీ నొప్పిగా ఉందంటూ కూర్చునేశారు. సహచర కూలీలు హుటాహుటిన ఆయన్ను విజయపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. చికిత్స పొందుతూ 10.30 గంటలకు కరుణాకర్‌ మృతిచెందారు. కేసు నమోదు చేసి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఎస్‌ఐ నరేశ్‌ నగరి ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఏపీవో బబిత జిల్లా అధికారులకు సమాచారమిచ్చారు. కరుణాకర్‌కు భార్య దేశమ్మ, కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుటుంబ పోషకుడిని కోల్పోయిన ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని పలువురు కోరారు.

‘108’ అందుబాటులో లేక..

నగరి, మే 15: విజయపురం నుంచి ఉపాధి కూలీ కరుణాకర్‌ను మెరుగైన చికిత్స కోసం తరలించేందుకు 108 అంబులెన్సు సోమవారం అందుబాటులోకి రాలేదని బాధితులు అంటున్నారు. నగరి, నిండ్ర, విజయపురం, పుత్తూరు, నారాయణవనంలోని 108 వాహనాలకు ఫోన్‌చేసినా అందుబాటులో లేక డయాలసిస్‌ బాధితులను తీసుకెళ్లినట్లు సమాచారం వచ్చిందన్నారు. దీంతో పీహెచ్‌సీ వద్దనే ఆయన చికిత్స పొందుతూ మృతిచెందిన విషయం తెలిసిందే. డయాలసిస్‌ బాధితులను 108 వాహనాల్లో తరలించినప్పుడు.. ప్రత్యామ్నాయంగా ఆ పక్క మండలాల్లో వాహనాలు అందుబాటులో ఉండేలా చూడాలని స్థానికులు కోరుతున్నారు.

Updated Date - 2023-05-16T00:55:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising