Tirupathi: కలెక్టరేట్ వద్ద ఏపీజేఏసీ ఆధ్వర్యంలో మహాధర్నా
ABN, First Publish Date - 2023-04-18T11:55:14+05:30
తిరుపతి: కలెక్టరేట్ వద్ద ఏపీజేఏసీ (APJAC) ఆధ్వర్యంలో ఉద్యోగులు (Employees) మహాధర్నా (Maha Dharna) చేపట్టారు.
తిరుపతి: కలెక్టరేట్ వద్ద ఏపీజేఏసీ (APJAC) ఆధ్వర్యంలో ఉద్యోగులు (Employees) మహాధర్నా (Maha Dharna) చేపట్టారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు (Bopparaju Venkteswarlu), వందలాదిమంది ప్రభుత్వ ఉద్యోగులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బొప్పరాజు మాట్లాడుతూ రాబోయే రోజుల్లో ఛలో విజయవాడ (Chalo Vijayawada) వంటి కార్యక్రమాలు చేపడతామన్నారు. ఉద్యోగ సంఘాలను ఇబ్బందులు పాలు చేసి దారికి తెచ్చుకోవాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోందని విమర్శించారు. ఉద్యోగుల మధ్య ఐక్యత ఉందని.. ఉద్యోగ సంఘాల నేతలు కలిసి పోరాడాలని అనుకుంటున్నామన్నారు.
నాయకుల తీరు ఎలా ఉన్నా సంఘాలకు అతీతంగా ఉద్యోగులు కదిలి వస్తున్నారని బొప్పరాజు వెంకటేశ్వర్లు తెలిపారు. ప్రైవేట్ కంపెనీ ద్వారా ప్రభుత్వం జీతాలు చెల్లిస్తోందని, ఎంత ఇవ్వాలో లెక్క కూడా చెప్పలేని పరిస్థితుల్లో ప్రభుత్వం ఉందని విమర్శించారు. ట్రెజరీ ద్వారా మాత్రమే తమకు పేమెంట్స్ జరగాలని డిమాండ్ చేశారు. తమ ఉద్యమంపై మంత్రులు అవహేళన చేయడం ద్వారా ఉద్యోగుల్లో మరింత కసి పెరుగుతోందని బొప్పరాజు పేర్కొన్నారు.
Updated Date - 2023-04-18T11:55:14+05:30 IST