మూడు ఎమ్మెల్సీ స్థానాలకు ముగిసిన నామినేషన్లు
ABN, First Publish Date - 2023-02-24T01:02:35+05:30
తూర్పు రాయలసీమ ప్రకాశం- నెల్లూరు- చిత్తూరు ఉమ్మడి జిల్లాల పట్టభద్రులు, ఉపాధ్యాయ, చిత్తూరు జిల్లా స్థానికసంస్థల ఎమ్మెల్సీ స్థానాలకు నామినేషన్ల స్వీకరణ గురువారం మధ్యాహ్నం మూడు గంటలతో ముగిసింది.
మొత్తం 53 మంది అభ్యర్థులు.. 88 నామినేషన్ల దాఖలు
పట్టభద్రుల స్థానానికి 39, ఉపాధ్యాయ స్థానానికి 12, ‘స్థానికానికి’ ఇద్దరు ఫ నేడు పరిశీలన
చిత్తూరు కలెక్టరేట్, ఫిబ్రవరి 23: తూర్పు రాయలసీమ ప్రకాశం- నెల్లూరు- చిత్తూరు ఉమ్మడి జిల్లాల పట్టభద్రులు, ఉపాధ్యాయ, చిత్తూరు జిల్లా స్థానికసంస్థల ఎమ్మెల్సీ స్థానాలకు నామినేషన్ల స్వీకరణ గురువారం మధ్యాహ్నం మూడు గంటలతో ముగిసింది. ఈనెల 16న నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైన విషయం తెలిసిందే. శుక్రవారం ఉదయం 11 గంటలకు రిటర్నింగ్ అధికారుల సమక్షంలో నామినేషన్లను పరిశీలిస్తారు. చివరిరోజైన గురువారం పట్టభద్రుల స్థానానికి 17మంది, ఉపాధ్యాయ స్థానానికి ఐదుగురు నామినేషన్లను రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ ఎం.హరినారాయణన్‌కు అందజేశారు. దీంతో మొత్తం 53 మంది అభ్యర్థులు.. 88 నామినేషన్ల దాఖలు చేశారు. వీరిలో పట్టభద్రుల స్థానానికి 39, ఉపాధ్యాయ స్థానానికి 12, ‘స్థానికానికి’ ఇద్దరు చొప్పున ఉన్నారు.
చివరి రోజు నామినేషన్లు వేసింది
పట్టభద్రుల స్థానం: అవిలినేని సరిత (టీడీపీ), చెముకుల సుధాకరయ్య (బీఎస్పీ), సన్నారెడ్డి దయాకర్ రెడ్డి (బీజేపీ), స్వతంత్ర అభ్యర్థులుగా మాదాసి జాలారావ్, బుస్సా రాజేంద్ర, నంద్యాల మహేంద్ర రెడ్డి, కత్తిరెడ్డి శ్రీకాంత్, కొమ్ము యోహాను, పి.రేఖ, సి.కరుణానిధి, నీలం శామ్యూల్ మోసెస్, మీగడ వెంకటేశ్వర్‌రెడ్డి, అప్పంగారి జయపాల్, పట్నం శ్రీరాములు, ఉల్ల వీరభద్రాచ్చారి, పూసల రవి, రాయపాటి జగదీష్.
ఉపాధ్యాయ స్థానం: పొక్కిరెడ్డి బాబురెడ్డి, ధనుంజయ శివయోగి, కుట్టబోయిన బ్రహ్మానందం, లక్కచిన్న రమణారెడ్డి, లక్క అనసుయమ్మ స్వతంతర అభ్యర్థులుగా నామినేషన్లు దాఖలు చేశారు
’స్థానికా’నికి ఇద్దరు
చిత్తూరు ఉమ్మడి జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి గురువారం ఇద్దరు అభ్యర్థులు ఆరు నామినేషన్లు దాఖలు చేశారు. వైసీపీ అభ్యర్థిగా సిపాయి సుబ్రహ్మణ్యం నాలుగు సెట్ల నామినేషన్‌ను రిటర్నింగ్ అధికారి, జేసీ ఎస్.వెంకటేశ్వర్‌కు అందజేశారు. ఆయనకు మద్ధతుగా డిప్యూటీ సీఎం నారాయణస్వామి, తిరుపతి ఎంపీ గురుమూర్తి, జడ్పీ చైర్మన్ జి.శ్రీనివాసులు, ఎమ్మెల్సీ భరత్, శ్రీకాళహస్తి, చిత్తూరు ఎమ్మెల్యేలు బియ్యపు మధుసూదన్‌రెడ్డి, ఆరణి శ్రీనివాసులు, చిత్తూరు మేయరు అముద తదితరులు హాజరయ్యారు. చివరి నిమిషంలో ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఏపీ పంచాయతీరాజ్ చాంబర్ జిల్లా అధ్యక్షుడు చుక్కా ధనుంజయ యాదవ్ రెండు సెట్ల నామినేషన్‌ను ఆర్వో వెంకటేశ్వర్‌కు అందజేశారు. ఆయనకు మద్దతుగా ఎమ్మెల్సీ దొరబాబు, టీడీపీ రాష్ట్ర అధికారప్రతినిధి సప్తగిరి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2023-02-24T01:02:37+05:30 IST