ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అన్ని రంగాల్లో అగ్రగామిగా.....

ABN, First Publish Date - 2023-01-27T01:18:04+05:30

పోలీసుల గౌరవ వందనం స్వీకరిస్తున్న కలెక్టర్‌,ఎస్పీ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుపతి జిల్లాను మారుస్తాం ఫ గణతంత్ర దినోత్సవంలో కలెక్టర్‌

తిరుపతి (నేరవిభాగం), జనవరి 26: తిరుపతి జిల్లాను అన్నిరంగాల్లో అగ్రగామిగా మారుస్తామని కలెక్టర్‌ కె. వెంకట్రమణారెడ్డి ప్రకటించారు.స్థానిక పోలీస్‌ పరేడ్‌ మైదానంలో గురువారం జరిగిన రిపబ్లిక్‌ డే వేడుకల్లో ఆయన మాట్లాడుతూ రాష్ట్రప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమాభివృద్ధి పథకాలను జిల్లాలో సమర్థవంతంగా అమలు చేస్తున్నామంటూ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జిల్లాలో సాధించిన ప్రగతి గురించి సుదీర్ఘంగా వివరించారు.ఎస్పీ పరమేశ్వర రెడ్డి మాట్లాడుతూ నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటున్నామన్నారు. పోలీసు శాఖలో గత ఏడాది చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలను వివరించారు.అనంతరం 52 ప్రభుత్వ శాఖల్లో ఉత్తమ సేవలందించిన 499మంది అధికారులకు, సిబ్బందికి కలెక్టర్‌, ఎస్పీ ప్రశంసా పత్రాలను అందజేసి అభినందించారు.వేడుకల్లో భాగంగా వివిధ శాఖల శకటాల ప్రదర్శన, పోలీస్‌ జాగిలాల విన్యాసాలు, విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. కలెక్టర్‌కు పోలీసు జాగిలం షైనీ పుష్పగుచ్ఛం అందజేసి గౌరవవందనం చేయడం ఆకట్టుకుంది.జేసీ బాలాజి, ఏఎస్పీలు వెంకట్రావు, కులశేఖర్‌, విమలకుమారి, లక్ష్మీనారాయణరెడ్డి, డీఎస్పీలు సురేంద్రరెడ్డి, నరసప్ప, రామరాజు, నందకిషోర్‌, రవీంద్రరెడ్డి, లక్ష్మణ్‌కుమార్‌, న్యాయమూర్తులు, న్యాయవాదులు, స్వాతంత్య్రసమర యోధులు పాల్గొన్నారు.

Updated Date - 2023-01-27T01:19:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising