ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

బీసీలకు ఇచ్చే గౌరవం ఇదేనా?

ABN, First Publish Date - 2023-09-16T01:36:22+05:30

బీసీ భవన్‌ ప్రారంభోత్సవ శిలాఫలకంలో కనిపించని బీసీ కార్పొపరేషన్ల నేతల పేర్లు

శిలాఫలకంలో పేరులేని ఈడిగ కార్పొరేషన్‌ చైర్‌పర్సన్‌ శాంతి ద్వారా బీసీ భవన్‌ను ప్రారంభింపచేస్తున్న మంత్రులు

చిత్తూరు, సెప్టెంబరు 15: బీసీల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చెప్పేదొకటి.. చేసేదొకటి. అన్ని విధాలా వారిని గౌరవిస్తున్నామని వేదికలపైన పాలకులు చెబుతున్నారు. కానీ, ఆచరణలో మాత్రం పాటించడంలేదు. బీసీ.. వాటిలోని ఉప కులాల వారికి కార్పొరేషన్లను ఏర్పాటు చేసి చైర్మన్లు, డైరెక్టర్లను నియమించారు. ఇన్ని రోజులు కేబినెట్‌ హోదా అని చె ప్పుకున్న బీసీ, ఉప కులాల్లోని చైర్మన్ల పేర్లు ఆ సంఘ భవనం ప్రారంభోత్సవ శిలాఫలకంలో కనపడలేదు. ఉన్నతస్థాయి ప్రజా ప్రతినిధులు, అధికారులను అడగలేక వీరంతా ఆవేదన చెందుతున్నారు.

చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు జిల్లా బీసీ భవన్‌ కోసం చిత్తూరు కలెక్టరేట్‌ సమీపంలోని సుమారు 1.48 ఎకరాలను కేటాయించారు. నిర్మాణ పనులకు రూ.5 కోట్లు మంజూరు చేసి.. అందులో రూ.4కోట్లను విడుదల చేశారు. అప్పట్లోనే దాదాపు 80 శాతం పనులు పూర్తయ్యాయి. వైసీపీ అధికారంలోకి వచ్చిన నాలుగేళ్లపాటు పనులు అలాగే నిలిచిపోయాయి. నాలుగు నెలల కిందట మొదలియార్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ బుల్లెట్‌ సురేష్‌, బీసీ సంఘం నేత రవి తదితరులు కలెక్టర్‌ షన్మోహన్‌ను కలిసి అసంపూర్తిగా ఉన్న బీసీ భవన్‌ పనులను పూర్తి చేయాలని కోరారు. దాంతో స్పందించిన కలెక్టర్‌ రూ.98 లక్షలను విడుదల చేశారు. భవనం పూర్తయింది. శుక్రవారం మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, డిప్యూటీ సీఎం నారాయణస్వామి, ఇతర ప్రజా ప్రతినిధులు కలిసి బీసీ భవన్‌ ప్రారంభోత్సవ శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అంతవరకు బాగానే ఉంది. కానీ బీసీ భవన్‌ నిర్మాణానికి కృషి చేసిన నాయకులు, జిల్లాలోని ప్రజా ప్రతినిధుల పేర్లు శిలాఫలకంలో లేవు. ఇక, రాష్ట్ర వ్యాప్తంగా బీసీలకు సంబంధించి 56 కార్పొరేషన్లు ఉండగా వాటిలో నాలుగింటికి జిల్లాకు చెందిన వారు రాష్ట్ర చైర్మన్లుగా ఉన్నారు. ఏపీ మొదలియార్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌గా బుల్లెట్‌ సురేష్‌, ఈడిగ కార్పొరేషన్‌ చైర్‌పర్సన్‌గా కేజే శాంతి, పాల ఏకిరి కార్పొరేషన్‌ చైర్మన్‌గా కుమార్‌ రాజా, వన్నియకుల క్షత్రియ కార్పొరేషన్‌ చైర్మన్‌ వనిత ఉన్నారు. వీరి పేర్లు ఆ శిలాఫలకంలో లేవు. ఇక, పూతలపట్టు, కుప్పం, పలమనేరు ఎమ్మెల్యేల పేర్లు కూడా వేయకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఏపీఈడబ్ల్యూడీసీ శాఖ అంటే భవన నిర్మాణం చేసిన ఎగ్జిక్యూటివ్‌ ఏజెన్సీ. కాంట్రాక్టు పొందిన సంస్థ పనిని పర్యవేక్షించడమే ఏజెన్సీ పని. నిర్మాణ వ్యయంలో 20 శాతం డబ్బులు మెయింటనెన్స్‌ కింద డిడెక్ట్‌ చేసుకుంటారు. ఈ లెక్కన చూస్తే నిర్మాణ సంస్థ నిర్వాహకులైన ఎండీ, సీఈ, ఈఈ పేర్లు వేయాల్సిన అవసరం లేదు. వీరి పేర్లను వేసుకుని ఆ భవన నిర్మాణం కోసం లేదా ఆ కులాలకు ప్రాతినిథ్యం వహిస్తున్న వారి పేర్లు లేకపోవడాన్ని చూస్తే వైసీపీ ప్రభుత్వం బీసీలకు ఎంత ప్రాధాన్యం ఇస్తుందో అర్థమవుతోందని ఆయా వర్గాలు అంటున్నాయి. కాగా, శిలాఫలకంలో పేరులేని ఈడిగ కార్పొరేషన్‌ చైర్‌పర్సన్‌ శాంతిచేత బీసీ భవన్‌కు రిబ్బన్‌ కత్తిరింపజేయడం కొసమెరుపు.

Updated Date - 2023-09-16T01:36:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising