ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

20 కిలోల గంజాయి స్వాధీనం : ఒకరి అరెస్టు

ABN, First Publish Date - 2023-09-22T00:58:00+05:30

నాయుడుపేట ఆర్టీసీ బస్టాండు ప్రాంగణంలో 20 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు సెబ్‌ సీఐ ఆర్‌యూవీఎస్‌ ప్రసాద్‌ తెలిపారు.

స్వాధీనం చేసుకున్న గంజాయి, నిందితుడి వివరాలు తెలియజేస్తున్న అధికారులు

నాయుడుపేట టౌన్‌, సెప్టెంబరు 21: నాయుడుపేట ఆర్టీసీ బస్టాండు ప్రాంగణంలో 20 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు సెబ్‌ సీఐ ఆర్‌యూవీఎస్‌ ప్రసాద్‌ తెలిపారు. నాయుడుపేట సెబ్‌ కార్యాలయంలో గురువారం రాత్రి వివరాలను ఆయన మీడియాకు వెల్లడించారు. వైజాగ్‌ నుంచి బెంగళూరుకు గంజాయి తరలిస్తున్నట్లు సమాచారం అందింది. దాంతో ఆర్టీసీ బస్టాండులో తనిఖీలు నిర్వహిస్తుండగా బెంగళూరుకు చెందిన రోహిత్‌ అనుమానాస్పదంగా కన్పించడంతో అదుపులోకి తీసుకుని, విచారించారు. అతడి వద్ద మూడు లక్షల విలువైన 20 కిలోల గంజాయిని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అరెస్టు చేశారు. ఇతను గతంలో బెంగళూరులోని ఓ కళాశాలలో లా చదువుతూ మధ్యలో ఆపేసినట్లు గుర్తించారు. ప్రస్తుతం గంజాయిని అదే కళాశాలలో చదువుతున్న విద్యార్థులకు సరఫరా చేస్తున్నట్లు నిందితుడు చెప్పినట్లు సెబ్‌ అధికారులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ చెప్పారు.

Updated Date - 2023-09-22T00:58:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising