ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ముగిసిన గంగ జాతర

ABN, First Publish Date - 2023-05-18T01:11:24+05:30

విశ్వరూప దర్శనానికి పోటెత్తిన భక్తజనం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుపతి(కల్చరల్‌), మే 17: వారం రోజులపాటు తిరుపతి నగరాన్ని హోరెత్తించిన గంగ జాతర బుధవారం తెల్లవారుజామున విశ్వరూప దర్శనంతో వైభవోపేతంగా ముగిసింది. తాతయ్యగుంట గంగమ్మ పునర్నిర్మాణ ఆలయంలో ఈనెల ఒకటో తేదీన మహాకుంభాభిషేకంతో సందడి మొదలైంది. 10వ తేదీనుంచి భక్తుల రకరకాల వేషాలతో, ప్రముఖుల సారెలతో నగరం హోరెత్తిపోయింది.. మంగళవారం రాత్రి గంగమ్మ ఆలయంలోని కొడి స్తంభం వద్ద ఏర్పాటు చేసిన అమ్మవారి మట్టి విగ్రహానికి బుధవారం ఉదయాత్పూర్వం రెండు గంటల తర్వాత చెంపనరుకుడు ఉత్సవం జరిగింది. పేరంటాల వేషంలోని కైకాల వంశస్తుడు సంప్రదాయం మేరకు గంగమ్మ చెంప నరకడంతో జాతర ముగిసింది. ఈ పేరంటాలు గంగమ్మ గుడి నుంచి నేరుగా బస్టాండు సమీపంలోని తాళ్ళపాక గంగమ్మ (పెద్ద గంగమ్మ) ఆలయానికి వెళ్లి అక్కడ ఏర్పాటు చేసిన విశ్వరూప ప్రతిమ చెంపను కూడా నరకడంతో జాతర పరిసమాప్తమైంది. ఈ రెండు ఆలయాల వద్ద అమ్మవారి ప్రతిమలోని మట్టి, పసుపు, కుంకుమల కోసం భక్తులు ఎగబడ్డారు. తాతయ్యగుంట గంగమ్మ ప్రతిమ మట్టికోసమైతే వేలాదిమంది భక్తులు పోటీపడ్డారు. వారిని నియంత్రించడానికి పోలీసులు చాలా కష్టపడాల్సి వచ్చింది.

Updated Date - 2023-05-18T01:11:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising