టాస్క్‌ఫోర్స్‌కు చిక్కిన స్మగ్లింగ్ బ్రదర్స్
ABN, First Publish Date - 2023-01-06T02:08:23+05:30
ఎర్రచందనం స్మగ్లింగ్‌కు సంబంధించి రాష్ట్రవ్యాప్తంగా 89 కేసుల్లో నిందితులైన ఇద్దరు బడా స్మగ్లర్లను అరెస్టు చేసినట్లు టాస్క్‌పోర్స్ ఎస్పీ కె.చక్రవర్తి చెప్పారు.
తిరుపతి అర్బన్, జనవరి 5 : ఎర్రచందనం స్మగ్లింగ్‌కు సంబంధించి రాష్ట్రవ్యాప్తంగా 89 కేసుల్లో నిందితులైన ఇద్దరు బడా స్మగ్లర్లను అరెస్టు చేసినట్లు టాస్క్‌పోర్స్ ఎస్పీ కె.చక్రవర్తి చెప్పారు.వీరు కడప జిల్లా చాపాడు మండలానికి చెందిన అన్నదమ్ములు షేక్ చెంపతిలాల్ బాషా(36), షేక్ చెంపతి జాకీర్(27) అని వివరించారు. తిరుపతిలో గురువారం మీడియాతో ఆయన మాట్లాడుతూ సీఐ రామకృష్ణ, ఆర్‌ఐ చిరంజీవి ఆఽధ్వర్యంలో కూంబింగ్ నిర్వహిస్తుండగా కరకంబాడి ప్రాంతంలో వీరు కనిపించారని తెలిపారు. టాస్క్‌ఫోర్స్ సిబ్బందిని గమనించి కారులో పారిపోవడానికి ప్రయత్నించగా ఆర్‌ఎస్‌ఐ రాఘవేంద్ర, ఇబ్బంది చుట్టుముట్టి పట్టుకున్నారన్నారు. కారుతో పాటు అందులో ఉన్న 31 ఎర్రచందనం దుంగలను స్వాఽధీనం చేసుకున్నామని తెలిపారు. కారులో పోలీస్ యూనిఫామ్ కూడా లభించిందని దీనిని వేసుకుని ఎర్రచందనాన్ని అక్రమ రవాణా చేయడంతో పాటు దుంగలను తరలిస్తున్న వాహనాలను హైజాక్ చేసి ఇతర రాష్ర్టాలకు అమ్మేయడం చేసేవారని ఎస్పీ తెలిపారు.ఆర్‌ఐ సురేష్‌కుమార్ రెడ్డి, సీఐలు చంద్రశేఖర్, బాలకృష్ణ, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.నిందితులను పట్టుకున్న సిబ్బందికి ఎస్పీ రివార్డులను ప్రకటించారు.
Updated Date - 2023-01-06T02:08:24+05:30 IST