ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ఎవరి కోసం వైసీపీ బస్సు యాత్ర?

ABN, First Publish Date - 2023-10-27T00:38:06+05:30

సామాజిక సాధికార బస్సు యాత్ర ఎవరి కోసమని ఏపీ ఎమ్మార్పీఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు పేరుపోగు వెంకటేశ్వరరావు మాదిగ ప్రశ్నించారు. గురువారం మధ్యాహ్నం ఆయన ఆధ్వర్యంలో స్థానిక ఆర్టీసీ బస్టాండు ముందున్న అంబేడ్కర్‌ విగ్రహం వద్ద వచ్చేనెల 30న జరిగే యుద్ధభేరి మహాసభను పురస్కరించుకుని చలో విజయవాడ కరపత్రాలను ఆవిష్కరించారు.

కరపత్రాలను ఆవిష్కరిస్తున్న ఎమ్మార్పీఎస్‌ నేతలు

తిరుపతి(కొర్లగుంట), అక్టోబరు 26: సామాజిక సాధికార బస్సు యాత్ర ఎవరి కోసమని ఏపీ ఎమ్మార్పీఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు పేరుపోగు వెంకటేశ్వరరావు మాదిగ ప్రశ్నించారు. గురువారం మధ్యాహ్నం ఆయన ఆధ్వర్యంలో స్థానిక ఆర్టీసీ బస్టాండు ముందున్న అంబేడ్కర్‌ విగ్రహం వద్ద వచ్చేనెల 30న జరిగే యుద్ధభేరి మహాసభను పురస్కరించుకుని చలో విజయవాడ కరపత్రాలను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం జగన్‌ అధికారంలోకి రాకముందు ఎస్సీ వర్గీకరణకు అనుకూలమని ప్రధానికి లేఖ రాశారని గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చిన తరువాత వర్గీకరణ ఊసేలేదని విమర్శించారు. సామాజిక న్యాయం పాటించిన జగన్‌ సామాజిక సాధికార బస్సు యాత్ర చేపట్టడం విడ్డూరంగా ఉందన్నారు. తుని ఘటనలో కాపులపై పెట్టిన కేసులు, కోనసీమ జిల్లా అంబేడ్కర్‌ పేరు పెట్టిన సందర్భంలో నమోదు చేసిన కేసులు, గుంటూరు ఘటనలో ముస్లింలపై పెట్టిన కేసులను ఎత్తివేసిన జగన్‌ 2017 గుంటూరు జిల్లాలో జరిగిన కురుక్షేత్రసభలో మాదిగలపై పెట్టిన కేసులను ఎందుకు ఎత్తివేయలేదని పశ్నించారు. తమపై వివక్షత చూపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాబోవు ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీలు మాదిగ, ఉపకులాలకు 21 అసెంబ్లీ, 4 పార్లమెంటు సీట్లు కేటాయించాలని డిమాండ్‌ చేశారు. యుద్ధభేరి మహాసభలో ఈ డిమాండ్‌ను ఉంచుతామని అన్నారు. అనంతరం స్థానిక జగ్జీవన్‌రామ్‌ భవన్‌లో సమావేశమై చలో విజయవాడ కార్యక్రమానికి సంబంధించి విధివిఽధానాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్‌ రాయలసీమ జిల్లా ప్రతినిధులు ఓబులేష్‌, శివ, మద్దిలేటి, వరదరాజులు, రాఘవ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-10-27T00:38:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising