Advocate Welfare Stamp : అడ్వకేట్ వెల్ఫేర్ స్టాంప్‌ను విడుదల చేసిన సీజే ధీరజ్‌సింగ్ ఠాకూర్
ABN, First Publish Date - 2023-09-16T04:24:12+05:30
అడ్వకేట్ వెల్ఫేర్ స్టాంప్‌ను హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకూర్ శుక్రవారం విడుదల చేశారు. ఏపీ బార్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వెల్ఫేర్ స్టాంప్ విడుదల
అమరావతి, సెప్టెంబరు 15(ఆంధ్రజ్యోతి): అడ్వకేట్ వెల్ఫేర్ స్టాంప్‌ను హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకూర్ శుక్రవారం విడుదల చేశారు. ఏపీ బార్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వెల్ఫేర్ స్టాంప్ విడుదల కార్యక్రమంలో సీజే ఠాకూర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ... ‘‘అడ్వకేట్ వృత్తి ప్రారంభ దశలో న్యాయవాదులు వృత్తిపరంగా అనిశ్చితి ఎదుర్కోవాల్సి ఉంటుంది. ప్రతి అవసరానికి సీనియర్‌పై ఆధారపడాల్సి వస్తుంది. అడ్వకేట్ సంక్షేమం కోసం చట్టం తీసుకురావడం సంతోషంగా ఉంది’’ అని అన్నారు. బార్ కౌన్సిల్ చైర్మన్ గంటా రామారావు మాట్లాడుతూ... ‘‘కరోనా సమయంలో చనిపోయిన న్యాయవాదుల కుటుంబాలను అదుకోవడం కోసం వెల్ఫేర్ సొమ్ము అంతా ఖర్చు చేయాల్సి వచ్చింది. మరో 100 కుటుంబాలకు పరిహారం చెల్లించాల్సి ఉంది. ఈ వెల్ఫేర్ స్టాంప్‌తో నిధుల కొరతను అధిగమించగలమని భావిస్తున్నాం. వెల్ఫేర్ స్టాంప్ తీసుకురావడంలో న్యాయ శాఖ కార్యదర్శి, అడ్వకేట్ జనరల్ కృషి మరువలేనిది’’ అని అన్నారు. కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తులు, అడ్వకేట్ జనరల్ ఎస్ శ్రీరామ్, హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు జానకీరామిరెడ్డి, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యులు ఏ రామిరెడ్డి, న్యాయవాదులు, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.
Updated Date - 2023-09-16T04:24:12+05:30 IST