CM Jagan : అధికారం అంటే అజమాయిషీ కాదు
ABN, First Publish Date - 2023-08-25T02:29:30+05:30
అధికారమంటే అజమాయిషీ కాదని, అది ప్రజల పట్ల చూపించే మమకారమని ముఖ్యమంత్రి జగన్ అన్నారు. ప్రజలకు మేలు చేయడం కోసం నాలుగడుగులు ముందుకు వేయడమే నిజమైన
ప్రజల పట్ల చూపించే మమకారం అది
మిగిలిపోయిన వారికి లబ్ధి చేకూరుస్తున్నాం
నవరత్నాలకు బటన్ నొక్కిన సీఎం జగన్
అమరావతి, ఆగస్టు 24 (ఆంధ్రజ్యోతి): అధికారమంటే అజమాయిషీ కాదని, అది ప్రజల పట్ల చూపించే మమకారమని ముఖ్యమంత్రి జగన్ అన్నారు. ప్రజలకు మేలు చేయడం కోసం నాలుగడుగులు ముందుకు వేయడమే నిజమైన అధికారమని తెలిపారు. గురువారం సీఎం క్యాంప్ కార్యాలయంలో నవరత్నాల అమల్లో మిగిలిపోయిన లబ్ధిదారుల కోసం జగన్ బటన్ నొక్కారు. అనంతరం ఆయన మాట్లాడారు. ‘‘గత ఆర్నెల్లుగా వివిధ కారణాల వల్ల పథకాలను అందుకోలేని 2.62 లక్షల మంది అర్హులైన లబ్ధిదారులకు మరలా రీవెరిఫికేషన్ చేసి వారికి అవకాశం కల్పిస్తున్నాం. గత ఆర్నెళ్ల కాలంలో కొత్తగా పింఛన్‌కార్డులు, బియ్యం కార్డులు, ఆరోగ్యశ్రీ కార్డులు, ఇళ్ల స్థలాలకు సంబంధించి కొత్తగా దరఖాస్తు చేసుకున్నవారికీ వాటిని మంజూరు చేసే కార్యక్రమం చేపట్టాం. ఇందులోభాగంగా కొత్తగా మరో 1,49,875 మందికి పెన్షన్లు, 2 లక్షల మందికి కొత్తగా బియ్యం కార్డులు, 4,327 మందికి ఆరోగ్యశ్రీకార్డులు, 12,069 మందికి ఇళ్ల స్థలాలు ఇస్తున్నామని పేర్కొన్నారు.
Updated Date - 2023-08-25T02:29:30+05:30 IST