ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కలుషితాహారంతో విలవిల

ABN, First Publish Date - 2023-01-31T03:09:27+05:30

పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం రామకృష్ణాపురంలోని డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ బాలికల గురుకుల పాఠశాలలో సోమవారం కలుషిత ఆహారం తిని 160 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

160 మంది విద్యార్థినులకు అస్వస్థత

సకాలంలో చికిత్స.. నిలకడగా ఆరోగ్యం

పల్నాడు జిల్లా గురుకులంలో ఘటన

సత్తెనపల్లి, జనవరి 30: పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం రామకృష్ణాపురంలోని డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ బాలికల గురుకుల పాఠశాలలో సోమవారం కలుషిత ఆహారం తిని 160 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. వివరాలివీ.. ఈ గురుకులంలో మొత్తం 627మంది విద్యార్థినులున్నారు. ఆదివారం మధ్యాహ్నం వారికి చికెన్‌తో, రాత్రి వంకాయ, సాంబారుతో భోజనాలు పెట్టారు. తెల్లవారేసరికే తొలు త 50 మంది విద్యార్థినులకు వాంతులు, విరేచనాలు అయ్యాయి. తర్వాత ఉదయం పలువురు విద్యార్థినులు అల్పాహారంగా టామాటా రైస్‌ తిన్నారు. ఈ క్రమంలో భోజనశాలలోనే విద్యార్థినులు కూలబడిపోయారు. వాంతులు, విరేచనాలతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.

మరికొందరు తలనొప్పి, ఒళ్లు నొప్పులు, జ్వరంతో విలవిల్లాడారు. దీంతో పాఠశాల ఇన్‌చార్జ్‌ చిలకా జయలక్ష్మి, ఉపాధ్యాయులు అప్రమత్తమై వెంటనే వారిని ఆటోల్లో సత్తెనపల్లి ఏరియా వైద్యశాలకు తరలించారు. అస్వస్థతకు ఫుడ్‌పాయిజన్‌ కారణం అని భావించిన వైద్యులు వెంటనే చికిత్స అందించారు. రాష్ట్ర మంత్రులు అంబటి రాంబాబు, మేరుగు నాగార్జున, రాష్ట్ర బీసీ గురుకుల పాఠశాలల ప్రిన్సిపల్‌ సెక్రటరీ జయలక్ష్మి, పల్నాడు జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ శ్యామ్‌ ప్రసాదు, ఆర్డీవో రాజకుమారి, డీఎస్పీ ఆదినారాయణ తదితరులు ఆస్పత్రికి వచ్చి విద్యార్థులను పరామర్శించారు. సత్తెనపల్లి, పరిసర ప్రాంతాల నుంచి కూడా వైద్యులను, సిబ్బందిని రప్పించి వైద్య సేవలు అందించారు. విద్యార్థినుల ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.

Updated Date - 2023-01-31T03:54:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising