LokeshPadayatra: ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలతో.. రాష్ట్రంలో సైకిల్ హవా మొదలైంది: నారా లోకేశ్
ABN, First Publish Date - 2023-03-17T21:01:04+05:30
ప్రస్తుతం వెలువడుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలతో.. రాష్ట్రంలో సైకిల్ హవా మొదలైంది.
రాయచోటి: ‘‘ప్రస్తుతం వెలువడుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలతో.. రాష్ట్రంలో సైకిల్ హవా మొదలైంది. సీఎం జగన్ (CM Jagan) పని అయిపోయింది. రాబోయేది టీడీపీ ప్రభుత్వమే’’ అని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ (NaraLokesh) ధీమా వ్యక్తం చేశారు. యువగళం పాదయాత్ర (YuvaGalamPadayatra)లో భాగంగా 45వరోజు శుక్రవారం ఉదయం అన్నమయ్య జిల్లా ములకలచెరువు మండలం పులికల్లు పంచాయతీ కమ్మపల్లి నుంచి నడక మొదలు పెట్టారు. ములకలచెరువులో సాయంత్రం జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. ‘ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 45 రోజులు పర్యటించాను. 14 నియోజకవర్గాల్లో పాదయాత్ర (Padayatra) చేశాను. 577 కిలోమీటర్లు నడిచాను. ప్రజలు పడుతున్న బాధలు నేరుగా తెలుసుకున్నాను. ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు లేక యువత హైదరాబాద్, బెంగళూరు, చెన్నై (Bangalore Chennai) వెళ్తున్నాం అని చెప్పినప్పుడు నాకు చాలా బాధ కలిగింది. ఉద్యోగాలు, ఉపాధి కల్పించలేని అసమర్థ ముఖ్యమంత్రి మనికు అవసరమా...?’ అని ప్రశ్నించారు.
పేదల రక్తాన్ని పీల్చే ముఖ్యమంత్రి అవసరమా?
తన కూతురు గంజాయికి బానిస అయిందని, బయటకు పంపడానికి కూడా భయం వేసి ఇంట్లో పెట్టి తాళం వేశానని ఒక తల్లి చెప్పినప్పుడు నాకు కన్నీరు ఆగలేదు. పన్నుల భారం, ఆకాశానికి చేరిన నిత్యావసర సరుకుల ధరలతో బతకడం కష్టంగా మారిందని మహిళలు ఆవేదన వ్యక్తం చేసినప్పుడు.. పేదల రక్తాన్ని పీల్చే ముఖ్యమంత్రి మనకి అవసరమా? అనిపించింది.
తాలిబాన్ పాలనలో ఉన్నామా?
మామిడి, చెరకు, టమోటా, వేరుశనగ రైతులు పడుతున్న కష్టాన్ని కళ్లారా చూశాను. పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించలేని రైతు వ్యతిరేక ప్రభుత్వం మనకు అవసరమా? అనిపించింది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలతో భేటీ అయ్యాను. వైసీపీ పాలనలో వాళ్లు ఎదుర్కొన్న వేధింపుల గురించి తెలుసుకున్న తరువాత మనం జగన్ పాలనలో ఉన్నామా ? లేక తాలిబాన్ పాలనలో ? ఉన్నామా అనే అనుమానం వచ్చింది.
Updated Date - 2023-03-17T21:01:04+05:30 IST