ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ఓటు వదలొద్దు

ABN, First Publish Date - 2023-10-31T02:45:53+05:30

కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన ముసాయిదా ఓటర్ల జాబితా-2024లో మీ పేరు ఉందో లేదో తెలుసుకోవాలంటే మీ చేతిలో స్మార్ట్‌ ఫోన్‌ ఉంటే చాలు.

ఓటరు అప్రమత్తతతోనే అక్రమాలకు చెక్‌

ఓటు.. రాజ్యాంగం కల్పించిన హక్కు. దీన్ని వినియోగించేది ఐదేళ్లకోసారే అయినా.. దేశ చరిత్రతోపాటు ప్రజల తలరాతనూ మార్చే శక్తి దీనికి ఉంది. రాష్ట్రంలో వచ్చే ఏడాది జరగనున్న ఎన్నికలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం ముసాయిదా ఓటర్ల జాబితా-2024ను విడుదల చేసింది. అయితే ఈ జాబితాలో మీ ఓటు ఉందో.. లేదో తెలుసుకోవడమెలా..? మీ పేరు ఉంచారో లేక తొలగించారో గుర్తించడమెలా..?

ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల చేసిన ఈసీ

అందులో మీ పేరుందో లేదో చూసుకోండి

మొబైల్‌, వెబ్‌సైట్‌లలోనూ తెలుసుకునే అవకాశం

పేరు లేకపోతే వెంటనే ఫాం-6 దరఖాస్తు ఇవ్వండి

స్మార్ట్‌ ఫోన్‌ ఉంటే చాలు..

కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన ముసాయిదా ఓటర్ల జాబితా-2024లో మీ పేరు ఉందో లేదో తెలుసుకోవాలంటే మీ చేతిలో స్మార్ట్‌ ఫోన్‌ ఉంటే చాలు. జ్ట్టిఞట://ఠి్ట్ఛౌటట.్ఛఛిజీ.జౌఠి.జీుఽ వెబ్‌సైట్‌లోకి వెళ్లగానే హోంపేజీలో ఫామ్స్‌ అని ఒక పక్క, సర్వీసెస్‌ అని మరో పక్క ఉంటుంది. సర్వీసెస్‌ విభాగంలో సెర్చ్‌ ఇన్‌ ఎలక్టోరల్‌, గెట్‌ ఎలక్టోరల్‌ డీటెయిల్స్‌ హియర్‌ అని ఉంటుంది. దానిపై క్లిక్‌ చేయగానే పై భాగంలో సెర్చ్‌ ఎలక్టోరల్‌ అని ఉంటుంది. అక్కడ రాష్ట్రం పేరు, భాష వివరాలు సెలెక్ట్‌ చేసుకుని ఆ తర్వాత పేజికి కుడివైపు పైభాగంలో ‘సెర్చ్‌ బై మొబైల్‌’ ఆప్షన్‌పై క్లిక్‌ చేసి మీ మొబైల్‌ నంబర్‌ ఎంటర్‌ చేయాలి. మీ ఓటరు కార్డుకి మీ ఫోన్‌ నంబర్‌ రిజిస్టర్‌ అయితే వెంటనే ఓటీపీ వస్తోంది. దాన్ని నమోదు చేశాక క్యాప్చా ఎంటర్‌ చేసి కింద ఉన్న సెర్చ్‌ బటన్‌పై క్లిక్‌ చేయగానే జాబితాలో ఉన్న వివరాలు కనిపిస్తాయి.

ఎపిక్‌ కార్డు నంబర్‌తోనూ తెలుసుకోవచ్చు..

జ్ట్టిఞట://ఠి్ట్ఛౌటట.్ఛఛిజీ.జౌఠి.జీుఽ వెబ్‌సైట్‌ ఓపెన్‌ చేయగానే సెర్చ్‌ ఇన్‌ ఎలక్టోరల్‌ రోల్‌ అనే విభాగం కనిపిస్తుంది. దానిపై క్లిక్‌ చేయగానే ‘సెర్చ్‌ ఇన్‌ ఎపిక్‌’ అనే పేజీ ఓపెన్‌ అవుతుంది. లాంగ్వేజ్‌ను సెలక్ట్‌ చేసుకుని కింద ఎపిక్‌ నంబర్‌ బాక్సులో మీ ఓటరు గుర్తింపు కార్డు సంఖ్యను నింపి, రాష్ట్రం వివరాలతోపాటు క్యాప్చాను నమోదు చేసి సెర్చ్‌ బటన్‌ నొక్కాలి. మీ పేరు.. ఏ పోలింగ్‌ కేంద్రం పరిధిలో ఉంది. సీరియల్‌ నంబరు ఎంత.. తదితర వివరాలన్నీ వస్తాయి.

పేరు, ఇతర వివరాలతోనూ తెలుసుకోవచ్చు

మీ ఫోన్‌ నంబర్‌ ఓటరు కార్డుకి లింక్‌ కాకపోయినా, మీ దగ్గర ఎపిక్‌ నంబర్‌ లేకపోయినా.. కూడా జాబితాలో మీ పేరు ఉందో లేదో తెలుసుకోవచ్చు. ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌ ఓపెన్‌ చేయగానే సెర్చ్‌ ఇన్‌ ఎలక్టోరల్‌ రోల్‌ అనే విభాగం కనిపిస్తోంది. దానిపై క్లిక్‌ చేయగానే సెర్చ్‌ ఎలక్టొరోల్స్‌ అనే పేజీ ఓపెన్‌ అవుతుంది. ఆ పేజీలో మీ పేరు, తండ్రి పేరు, జిల్లా, అసెంబ్లీ నియోజకవర్గం వివరాలు పొందుపరిచి సెర్చ్‌ కొడితే... జాబితాలో మీ పేరు ఉందా? లేదా తెలుసుకోవచ్చు.

యాప్‌తో మరింత సులువు

ఓటర్‌ హెల్ప్‌లైన్‌ అనే మొబైల్‌ యాప్‌లో కూడా జాబితాలో వివరాలు తెలుసుకోవచ్చు. గూగుల్‌ ప్లే స్టోర్‌ నుంచి ఈ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుని మీ ఫోన్‌ నంబర్‌ వివరాలతో రిజిస్టర్‌ చేసుకుని లాగిన్‌ అవ్వాలి. యాప్‌లోకి ప్రవేశించగానే సెర్చ్‌ యువర్‌ నేమ్‌ ఇన్‌ ఎలక్టోరల్‌ రోల్‌ అనే విభాగం ఉంటుంది. దానిపై క్లిక్‌ చేస్తే సెర్చ్‌ బై బార్‌ కోడ్‌, సెర్చ్‌ బై క్యూఆర్‌ కోడ్‌, సెర్చ్‌ బై డీటెయిల్స్‌, సెర్చ్‌ బై ఎపిక్‌ నంబరు అనే నాలుగు ఆప్షన్లు కనిపిస్తాయి.

సీఈవో ఆంధ్రాలో బూత్‌ల వారీ వివరాలు..

జ్ట్టిఞట://ఛ్ఛి్చౌుఽఛీజిట్చ.ుఽజీఛి.జీుఽ వెబ్‌సైట్‌ ఓపె న్‌ చేయగానే పైన హోమ్‌, ఎబౌట్‌ అజ్‌, పీడీ ఎఫ్‌ ఎలక్టోరల్‌ రోల్స్‌.. తదితర విభాగాలు కనిపిస్తాయి. వాటిలో పీడీఎఫ్‌ ఎలక్టోరల్‌ రోల్స్‌పై క్లిక్‌ చేయాలి. అందులో అసెంబ్లీ, శాసనమండలి అనే రెండు విభాగాలుంటాయి. అసెంబ్లీ నియోజకవర్గాలు అనే విభాగంపైలో డ్రాఫ్ట్‌ ఎలక్టోరల్‌ రోల్‌-2024పై క్లిక్‌ చేయాలి. రాష్ట్రం, జిల్లా, అసెంబ్లీ నియోకవర్గం, క్యాప్చాతో కూడిన టేబుల్‌ వస్తుంది. దానిలో వివరాలు నింపగానే ఆ నియోజకవర్గంలోని అన్ని పోలింగ్‌ కేంద్రాల ఓటర్ల జాబితా వివరాలు పీడీఎఫ్‌ పైల్స్‌లో ఉంటాయి. ప్రతి పోలింగ్‌ కేంద్రానికీ ఒక బీఎల్‌వో ఉంటారు. వారి వద్ద ఓటర్ల జాబితా ఉంటుంది. ఆ జాబితాలో మీ పేరు ఉందో లేదో పరిశీలించుకోవచ్చు.

పేరు లేకపోతే ఫారం-6 దరఖాస్తు

జాబితాలో పేరు లేకపోతే.. ఆలస్యం చేయకుండా ఫాం-6కు దరఖాస్తు చేయాలి. మీ గ్రామంలోనే మీ ఏరియా పోలింగ్‌ బూత్‌కు సంబంధించిన బీఎల్‌వో వద్ద ఫారం-6 దరఖాస్తు సమర్పించవచ్చు. ఇది ఒక విధానం.

కొత్తగా ఓటు నమోదు చేసుకోవాలంటే..

జ్ట్టిఞట://ఠి్ట్ఛౌటట.్ఛఛిజీ.జౌఠి.జీుఽ వెబ్‌సైట్‌లోకి వెళ్లి ముందుగా ఫోన్‌ నంబర్‌తో రిజిస్ట్రేషన్‌ చేసుకుని లాగిన్‌ అవ్వాలి. వెబ్‌సైట్‌లోకి ప్రవేశించగానే న్యూ ఓటర్‌ రిజిస్ట్రేషన్‌ విభాగంపై క్లిక్‌ చేసి.. దరఖాస్తులో అడిగిన వివరాలన్నీ నమోదు చేసి అప్లికేషన్‌ సబ్మిట్‌ చేయాలి. ఓటర్‌ హెల్ప్‌లైన్‌ మొబైల్‌ యాప్‌లోనూ కొత్తగా ఓటు నమోదు చేసుకోవచ్చు.

-ఆంధ్రజ్యోతి, అమరావతి

ఓటు అక్రమంగా తొలగిస్తే అప్పీల్‌కు వెళ్లొచ్చు

ముసాయిదా ఓటర్ల జాబితాలో మీ ఓటుని అక్రమంగా తొలగిస్తే.. దీనిపై మీరు జిల్లా ఎలక్షన్‌ ఆఫీసర్‌ (జిల్లా కలెక్టర్‌-డీఈవో)కు ఫిర్యాదు చేయవచ్చు. ఓటర్ల జాబితా నుంచి తన పేరును అక్రమంగా తొలగించారని అప్పీల్‌కు వెళ్లవచ్చు. అప్పుడు కలెక్టర్‌ నోటీసులు ఇచ్చి, పరిశీలన విచారణలో నిజమని తేలితే ఓటు హక్కు తిరిగి ఇవ్వాలని కలెక్టర్‌ ప్రొసీడింగ్స్‌ ఇస్తారు. అయితే కలెక్టరు ఆ ఓటరు అప్పీళ్లను తిరస్కరిస్తే రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈవోకి) సెకండ్‌ అప్పీల్‌కు వెళ్లవచ్చు. అయితే ఈ ముసాయిదా ఓటర్ల జాబితా ప్రకటించిన తేదీ నుంచి 15 రోజులలోపు కలెక్టర్‌ వద్ద అప్పీల్‌ చేసుకోవాలి. సమాచారం, సందేహాల నివృత్తి కోసం.. టోల్‌ ఫ్రీ నంబర్‌.. 1950కి కాల్‌ చేయవచ్చు.

Updated Date - 2023-10-31T02:45:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising