Dwaraka Tirumala: ద్వారకాతిరుమల దేవస్థానం సస్పెండ్ ఉద్యోగి అరెస్ట్
ABN, First Publish Date - 2023-05-04T18:20:30+05:30
ద్వారకాతిరుమల దేవస్థానం సస్పెండ్ ఉద్యోగిని పోలీసులు అరెస్ట్ చేశారు. రికార్డ్ అసిస్టెంట్ చిలుకూరి పవన్‌ను అరెస్ట్ చేశారు. భీమడోలు కోర్టు (Bhimadolu Court)లో పవన్‌ను హాజరుపరిచారు.
ఏలూరు: ద్వారకాతిరుమల దేవస్థానం సస్పెండ్ ఉద్యోగిని పోలీసులు అరెస్ట్ చేశారు. రికార్డ్ అసిస్టెంట్ చిలుకూరి పవన్‌ను అరెస్ట్ చేశారు. భీమడోలు కోర్టు (Bhimadolu Court)లో పవన్‌ను హాజరుపరిచారు. పవన్‌కు న్యాయమూర్తి 14 రోజులు రిమాండ్ విధించారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ద్వారకా తిరుమల (Dwaraka Tirumala) చిన్న వెంకన్న స్వామి వారిని రోజు వేలాది మంది భక్తులు (Devotees) దర్శించుకుంటారు. భక్తుల రద్దీని ఆసరాగా తీసుకొని ఆలయ ఉద్యోగి అక్రమాలకు పాల్పడటం కలకలం సృష్టించింది. ఉద్యోగి చిలుకూరి పవన్ శీఘ్ర దర్శనానికి సంబంధించిన రూ.200 రూపాయల టికెట్లను ఒకే సీరియల్ నెంబర్‌తో ప్రింట్ తీసి రీసెల్ చేస్తుండగా ఆలయ సూపరింటెండెంట్ సుబ్రహ్మణ్యం రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. వెంటనే ఆలయ ఈవో త్రినాధరావుకు అప్పగించారు. తక్షణమే స్పందించిన ఈవో.. పవన్‌ను సస్పెండ్ చేశారు.
Updated Date - 2023-05-04T18:20:30+05:30 IST