ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అమ్మలేదని.. తిరిగి రాదని..

ABN, First Publish Date - 2023-05-15T01:28:02+05:30

మధ్యాహ్నానికి వచ్చేస్తానని చెప్పి వెళ్లిన అమ్మ ఎప్పుడొస్తుందని ఎదురుచూస్తున్న నా పిల్లలకు నేనేం చెప్పను.. ఎలా ఓదార్చను.. ఇదీ ఒక తండ్రి బాధ.. నువ్వు లేకపోతే ఎలా బతకాలమ్మా.. నిన్నటి వరకూ అన్నీ నువ్వే చూశావ్‌.. ఈ రోజు మమ్మల్ని వదిలేసి వెళ్లిపోతే ఎలాగమ్మా.. మమ్మల్ని ఎవరు చూస్తారమ్మా ఇదీ యువతి రోదన.. నన్ను బాగా చదివిస్తానన్నావు.. ఇలా వదిలేసి వెళ్లిపోయావేంటమ్మా.. ఇదీ ఒక యువకుడి వ్యథ.. నా పెళ్లి అంగరంగ వైభవంగా చేస్తానన్నావు.. ఉదయం వరకూ మా మధ్యనే ఆనందంగా తిరిగావు.. మళ్లీ వస్తానని చెప్పి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయావు.. నా పెళ్లి ఎవరు చేస్తారమ్మా.. మమ్మల్ని ఎవరు చూస్తారమ్మా.. ఇదీ నాలుగు రోజుల కిందట నిశ్చతార్థమైన ఒక కుమార్తె తీరని బాధ.. ఇలా కాకినాడ జీజీహెచ్‌ ప్రాంగణం మృతుల బంధువుల రోధనలతో నిండిపోయింది.. మృతదేహాలను చూస్తూ బోరున విలపించారు..గుర్తుపట్టలేని విధంగా తయారైన శరీరాలను చూసి వెక్కి వెక్కి ఏడ్చారు. అమ్మ లేదని ఇక తిరిగిరాదని తెలిసి పిల్లలు కన్నీటిపర్యంతమయ్యారు. మాతృదినోత్సవం రోజున ఒకే ప్రాంతానికి చెందిన ఏడుగురు మాతృమూర్తుల మృతి వారి కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపింది.

ప్రమాదంలో నుజ్జునుజ్జయిన ఆటో
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • మాతృదినోత్సవం రోజునే ఏడుగురు తల్లులు మృతి

  • రెప్పపాటులో ఆటోను ఢీకొన్న ప్రైవేట్‌ బస్‌

  • తాళ్లరేవు మండలం కోరంగి వద్ద ప్రమాదం

  • రాంగ్‌ రూట్‌లో వచ్చి ఢీకొన్న బస్‌

  • అక్కడికక్కడే ఆరుగురి దుర్మరణం

  • గుండెపోటుతో మరొకరి మృతి

  • ఆటోలో పరిమితికి మించి మహిళలు

  • అపెక్స్‌ ఫ్యాక్టరీ నుంచి వెళుతుండగా ఘటన

  • యానాంలో తీవ్ర విషాదం

మధ్యాహ్నానికి వచ్చేస్తానని చెప్పి వెళ్లిన అమ్మ ఎప్పుడొస్తుందని ఎదురుచూస్తున్న నా పిల్లలకు నేనేం చెప్పను.. ఎలా ఓదార్చను.. ఇదీ ఒక తండ్రి బాధ.. నువ్వు లేకపోతే ఎలా బతకాలమ్మా.. నిన్నటి వరకూ అన్నీ నువ్వే చూశావ్‌.. ఈ రోజు మమ్మల్ని వదిలేసి వెళ్లిపోతే ఎలాగమ్మా.. మమ్మల్ని ఎవరు చూస్తారమ్మా ఇదీ యువతి రోదన.. నన్ను బాగా చదివిస్తానన్నావు.. ఇలా వదిలేసి వెళ్లిపోయావేంటమ్మా.. ఇదీ ఒక యువకుడి వ్యథ.. నా పెళ్లి అంగరంగ వైభవంగా చేస్తానన్నావు.. ఉదయం వరకూ మా మధ్యనే ఆనందంగా తిరిగావు.. మళ్లీ వస్తానని చెప్పి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయావు.. నా పెళ్లి ఎవరు చేస్తారమ్మా.. మమ్మల్ని ఎవరు చూస్తారమ్మా.. ఇదీ నాలుగు రోజుల కిందట నిశ్చతార్థమైన ఒక కుమార్తె తీరని బాధ.. ఇలా కాకినాడ జీజీహెచ్‌ ప్రాంగణం మృతుల బంధువుల రోధనలతో నిండిపోయింది.. మృతదేహాలను చూస్తూ బోరున విలపించారు..గుర్తుపట్టలేని విధంగా తయారైన శరీరాలను చూసి వెక్కి వెక్కి ఏడ్చారు. అమ్మ లేదని ఇక తిరిగిరాదని తెలిసి పిల్లలు కన్నీటిపర్యంతమయ్యారు. మాతృదినోత్సవం రోజున ఒకే ప్రాంతానికి చెందిన ఏడుగురు మాతృమూర్తుల మృతి వారి కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపింది.

(కాకినాడ,ఆంధ్రజ్యోతి)/తాళ్లరేవు/యానాం/కాకినాడ క్రైం, మే 14: మాతృదినోత్సవం రోజే ఏడుగురు మాతృమూ ర్తులు తీరని వ్యధ మిగిల్చారు. కాసేపట్లో ఇంటికి వెళ్లిపోతా మనుకునేలోగా ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు.ఏకంగా ఏడుగురు మాతృమూర్తులు ఆదివారం తాళ్లరేవు మండలం కోరంగి పరిధిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందడం తీవ్ర విషాదాన్ని నింపింది. ఎప్పటిలాగే వీరంతా అపెక్స్‌ రొయ్యల ఫ్యాక్టరీకి ఉదయం ఆరు గంటలకు ఏ-షిఫ్ట్‌ విధులకు వచ్చారు. తిరిగి మధ్యాహ్నం రెండు గం టలకు విధులు ముగించుకుని ఇంటికి బయలుదేరారు. మరో 15 నిమిషాలు ఆగితే అంతా యానాంలోని ఇళ్లకు వెళ్లిపోయేవారు.ఈలోపు విధి కన్నుకు ట్టిందో ఏమో మోజో బస్సు రూపంలో వచ్చి వీరి నిండుప్రాణాలను గాల్లో కలి పేసింది. ప్రమాదం సమయంలో వీరంతా కాపాడండి అంటూ హాహాకారాలు చేశారు. కానీ రెప్పపాటులో ఘోరం జరిగిపోయింది.అందరూ చూస్తుండగానే పెద్దశబ్దంతో బస్సు ఆటోను పావు కిలో మీటరు ఈడ్చుకుపోయింది. అదే సమయంలో ఆటోలోంచి ఒక్కొక్కరు కింద పడిపోయారు. కొందరి కాళ్లు,చేతులు తెగిపడి చెల్లాచెదురుగా పడ్డాయి. కొందరి తలభాగాలు నుజ్జునుజ్జయిపోయాయి.రెప్పపాటులో జరిగిన ఘోరాన్ని చూసిన ప్రత్యక్ష సాక్షులు తేరుకోలేక పో యారు.కళ్లెదుటే ఆరుగురు చనిపోవడంతో ఆందోళనకు గురయ్యారు. ఆటో వెనుక కూర్చున్న కొందరికి తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే కుప్పకూలి పోయారు. మృతిచెందిన వారంతా యానాంలో నిరుపేద కుటుంబా లకు చెందిన మహిళలు. దీంతో ఆయా కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. ఏడు మృతదేహాలను కాకినాడ జీజీ హెచ్‌కు తరలించారు.సోమవారం పోస్టుమార్టం నిర్వ హిం చనున్నారు. ప్రమాదంలో మరో ఆరుగురు గాయపడగా వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. కుటుంబ సభ్యుల కోరిక మేరకు వీరందరిని కాకినాడలోని ఓ ప్రైవేటు ఆసు పత్రికి తరలించారు.ఆటోడ్రైవర్‌ వెంకటేశ్వరరావు, ప్రమాదా నికి కారణ మైన మోజో బస్సు డ్రైవర్‌ మహేష్‌ ఇద్దరు సురక్షితంగా ఉన్నారు. వీరిద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. బస్సు పుదుచ్చేరి రిజిస్ట్రేషన్‌తో ఉండగా, ఆటో ఏపీ05 టీడీ 5676 నెంబర్‌తో ఉంది. సదరు ఆటో డ్రైవర్‌ తరచూ మహిళల ఇంటికి వెళ్లి నేరుగా అపెక్స్‌ రొయ్యల ఫ్యాక్టరీ వద్ద దించుతాడు. తిరిగి ఈయనే తీసుకువెళతాడు.ఈ ఆటో ఉద్యోగుల తరలింపు నకు కంపెనీయే నడుపుతుందని ప్రమాదంలో మృతిచెం దిన వెంకటలక్ష్మి భర్త కోటేశ్వరరావు విలపించాడు. ప్రమా దానికి కారణమైన ఇద్దరు డ్రైవర్లు మద్యం సేవించి వాహ నాలు నడిపారా అనే కోణంలో పోలీసులు విచారిస్తు న్నా రు. ప్రమాద సమాచారం తెలుసు కున్న జిల్లా కలెక్టర్‌ కృతికా శుక్లా యానాం అధికారులకు ఫోన్‌లో సమాచారం అందించడంతో వారంతా వచ్చి క్షతగాత్రులను పరామ ర్శిం చారు.216వ నెంబర్‌ జాతీయ రహదారి మృత్యు పాశంగా మారింది.తరచూ దీనిపై ప్రమాదాలు జరు గుతుండడంతో ఎందరో ప్రాణాలు కోల్పో తున్నారు. ప్రధానంగా కత్తిపూడి నుంచి 216 జాతీయ రహదారి ప్రారం భమైనా కాకినాడ రూరల్‌ వద్దకు వచ్చే సరికి తాళ్లరేవు వరకు అత్యంత ఇరుగ్గా ఉంటోంది. రెండు వైపులా వాహనాల రాకపోకలకు ఒకటే దారి.ఎదురెదురుగా వస్తోన్న వాహనాలు తరచూ ఢీకొని ప్రమాదాలు జరుగు తున్నాయి. అయినా అధికారులు పట్టించుకోవడం లేదు.

మృతులు వీరే..

శేసెట్టి వెంకటలక్ష్మి(41), మెట్టకూరు, కర్రి పార్వతి(44), మెట్టకూరు, కల్లి పద్మ(45), కొత్త బస్టాండ్‌, నిమ్మకాయల లక్ష్మి(54), కురసాంపేట, బొక్కా అనంతలక్ష్మి(47), ఫ్రాన్స్‌ తిప్ప, చింతపల్లి జ్యోతి(38), వెంకట్‌నగర్‌, గుడపనేటి సత్యవతి(38), ఫ్రాన్స్‌ తిప్ప.. వీరంతా యానాంకు చెందిన వారే.. ప్రమాదంలో మృతి చెందిన తల్లులందరికీ కూడా పిల్లలు ఉన్నారు.

క్షతగాత్రులు వీరే..

నోట్ల సత్యవేణి(28), కురసాంపేట, ఓలేటి లక్ష్మి(35), కురసాంపేట, మల్లాడి గంగాభవానీ(25), ఫ్రాన్స్‌తిప్ప, రచ్చా వెంకటేశ్వరమ్మ(45), ఫ్రాన్స్‌తిప్ప, గుడపనేటి ప్రభావతి(18), ఫ్రాన్స్‌తిప్ప, కోటి నీలిమ(26), గణపతినగర్‌,చింతపల్లి మంగాయమ్మ(50), వెంకట్‌నగర్‌. వీరంతా యానాంకు చెందిన వారే..

త్వరలోనే పెళ్లి.. ఇంతలో తల్లి మృతి

యానాం, మే 14: ఆ ఇంట్లో నాలుగు రోజుల క్రితమే నిశ్చితార్థం జరిగింది. త్వరలోనే వివాహం కూడా చేయా లని నిశ్చయించుకున్నారు. ఇది జరిగి నాలుగు రోజులు కాకుండానే ఆ ఇంట విషాదం చోటుచేసుకుంది. యానాం ఫ్రాన్స్‌తిప్పలో అద్దెకు ఉంటున్న గుడపనేటి సత్యవతి(38) కొన్నేళ్లుగా రొయ్యల పరిశ్రమకు వెళుతూ కుటుంబాన్ని పోషిస్తోంది. ఆమె భర్త హోటల్‌లో పనిచేస్తుంటాడు. వీరికి ఇద్దరు కుమార్తెలు.పెద్దకుమార్తె సరస్వతికి నాలుగు రోజుల కిందట నిశ్చితార్థం చేశారు.త్వరలో పెళ్లి జరగాల్సిన ఇంట్లో తల్లి మరణవార్త వినడంతో కుటుంబీకులు కన్నీరుమున్నీరవుతున్నారు. సత్యవేణి చికిత్స పొందుతూ మృతి చెందగా తల్లితో పాటు పనికి వెళ్లిన చిన్న కుమార్తె ప్రభావతి గాయాలతో కాకినాడ జీజీహెచ్‌లో చికిత్స పొందుతోంది.

కళ్లెదుటే..క్షణాల్లో జరిగిపోయింది..

ఇది చాలా భయంకరమైన ప్రమాదం. నా కళ్లెదుటే క్షణాల్లో జరిగిపోయింది. నేను ఓ ఫంక్షన్‌కి వెళ్లి మధ్యాహ్నం 2.05 గంటల సమయంలో వస్తుండగా ప్రైవేటు బస్సు వేగంగా వస్తూ ఆటోను బలంగా ఢీకొట్టి ఫర్లాంగు దూరం ఈడ్చుకుపోయింది. ఆటోలో ఉన్న మహిళలు కాపాడండంటూ హాహాకారాలు చేశారు. కొందరు అక్కడిక్కడే మృతిచెందారు. చాలా సేపు నేనే తేరుకోలేదు. ఇప్పటికీ కంగారుగా ఉంది. - కొప్పనాతి నాగరాజు, చినబొడ్డువెంకటాయపాలెం, కోరంగి

తోడుగా ఉంటుందనుకుంటే..

మాకు ఇద్దరూ ఆడపిల్లలు కావడంతో చన్నీళ్లకు వేన్నీళ్లు తోడుగా ఉంటాయనుకున్నా. ఆర్థికంగా సహాయంగా ఉంటే ఇద్దరి సంపాదనతో పిల్లలకు ఒకదారి చూపించొచ్చనే ఉద్దేశ్యంతో అపెక్స్‌ కంపెనీకి పంపిస్తున్నా. ఉదయాన్నే 6 గంటలకు షిఫ్ట్‌కు వెళ్లిన నా భార్య తిరిగొచ్చే సమయమైందని ఎదురుచూస్తున్నాను. ఈ తరుణంలో పిడుగు లాంటి వార్త వినేసరికి నా నవనాడులు స్తంభించిపోయాయి. పిల్లలు తల్లి లేని పిల్లలయ్యారు.

-శేసెట్టి కోటేష్‌, మృతురాలు వెంకటలక్ష్మి భర్త

ఏం జరిగిందో తెలియలేదు

మూడేళ్లుగా అపెక్స్‌ రొయ్యల శుద్ధి కర్మాగారంలో పనిచేస్తున్నాను. నాకు భర్త లక్ష్మణ్‌, కుమారుడు, కుమార్తె ఉన్నారు. నా భర్తకు ఆర్థికంగా సాయపడేందుకు ఈ పనికి వెళ్తున్నాను. కంపెనీ వారు సమకూర్చిన ఆటో యానాంలోని పలు ప్రాంతాలనుంచి మహిళలను పనికి తీసుకెళ్లి తీసుకొస్తుంటుంది. రోజూ మాదిరిగానే ఈ రోజు కూడా ఫస్ట్‌ షిఫ్ట్‌ డ్యూటీకి వెళ్లాను. విధులు ముగించుకుని మిగతా మహిళా కార్మికులతో తిరిగి ఇంటికి బయలుదేరిన కొద్దిసేపటికే రెప్ప పాటులో ప్రమాదం జరిగిపోయింది. కళ్లు తెరిచి చూసేసరికి కాకినాడ జీజీహెచ్‌లో ఉన్నాను.

-మల్లాడి గంగాభవానీ, క్షతగాత్రురాలు

డ్రైౖవర్‌ మద్యం మత్తులో ఉన్నాడు

మాది యానాం నియోజకవర్గంలోని మెట్టకుర్రు. కొంతకాలంగా అపెక్స్‌ కంపెనీలో రొయ్యల ఒలుపు పనికి వెళ్తున్నాను. ఆటోడ్రైవర్‌ వెంకటేశ్వర్రావు ఉదయం డ్యూటీకి తీసుకెళ్లేటప్పుడు బాగానే ఉన్నాడు. మధ్యాహ్నం తిరిగి ఇంటికి తీసుకెళ్లేటప్పుడు మద్యం సేవించి ఉన్నట్టు అనిపించింది. సహచర మహిళలతో మాటల్లో పడి ఉండగా ఒక్కసారిగా పెద్ద శబ్ధం వచ్చి ఏం జరిగిందో తెలియలేదు. చూస్తే ఆస్పత్రిలో ఉన్నాను.

-కోటి నీలిమ, క్షతగాత్రురాలు

Updated Date - 2023-05-15T01:28:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising