ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అందరివాడు అంబేడ్కర్‌..

ABN, First Publish Date - 2023-04-15T01:08:01+05:30

జిల్లా వ్యాప్తంగా అంబేడ్కర్‌ 132వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. జై భీమ్‌ నినాదాలతో యువత హోరెత్తించారు.

ఎస్పీకార్యాలయంలో పూలమాల వేస్తున్న ఎస్సీ సుధీర్‌కుమార్‌ రెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

రాజమహేంద్రవరం(ఆంధ్రజ్యోతి)/బొమ్మూరు, ఏప్రిల్‌ 14 : జిల్లా వ్యాప్తంగా అంబేడ్కర్‌ 132వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. జై భీమ్‌ నినాదాలతో యువత హోరెత్తించారు. ఊరూవాడా అంబే డ్కర్‌ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఎక్కడి కక్కడ పోలీసులు బందోబస్తు నిర్వహించారు. జిల్లా కలెక్టరేట్‌లో ఆయన చిత్రపటానికి డీఆర్‌వో నరసింహులు, వ్యవసాయాధికారి మాధవరావు, ఏవో భీమారావు,డీఎస్‌వో ప్రసాదరావు, ఎస్పీ కార్యా లయంలో ఎస్పీ సుధీర్‌కుమార్‌ రెడ్డి, ఏఎస్పీలు ఎం.రజనీ, సీహెచ్‌ పాపారావు, జీ.వెంకటేశ్వరరావు, ట్రైనీ ఐపీఎస్‌ పంకజ్‌ అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అంబేడ్కర్‌ అందరి వాడని.. ఆయన పేరు పలకడమే స్ఫూర్తిదాయకమని డీఆర్వో నరసింహులు అన్నారు. అంబేడ్కర్‌ ఆశయ సాధన అందరి బాధ్యత అని ఎస్పీ అన్నారు. దేశ విభజనానంతరం భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశంగా, ప్రపంచంలోనే ఒక గొప్ప శక్తిగా అత్యంత తక్కువ సమయంలో ఎదిగిందంటే అది అంబేడ్కర్‌ రాసిన రాజ్యాంగం గొప్ప తనమని కొనియాడారు. భారత రాజ్యాంగం ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైనదన్నారు. సమాజంలోని అసమానతలను తొలగించడానికి అంబే డ్కర్‌ ఎంతో శ్రమించారన్నారు. మహిళా సాధికారతకు ఎంతో కృషి చేసిన మహనీయుడన్నారు. అంబేడ్కర్‌ చూపిన బాట ఎన్నటికీ అను సరణీయమని.. అందరూ ఆ మార్గంలో నడిచి దేశాభివృద్ధికి పాటుపడాలని సూచించారు.

Updated Date - 2023-04-15T01:08:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising