ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పాశవికం

ABN, First Publish Date - 2023-03-21T00:52:14+05:30

జిల్లాలో అంగన్‌వాడీలపై రాష్ట్రప్రభుత్వం ఉక్కుపాదం మో పింది. తమ న్యాయ మైన డిమాండ్ల సాధనకోసం విజయవా డలో నిర్వహిస్తున్న మహాసభకు తరలి వెళ్తున్న వారిపై కర్క శంగా వ్యవహరించింది. మహిళలని కూడా చూడకుండా పాశవికంగా ప్రవర్తించింది. పోలీసులను అడ్డం పెట్టుకుని ఎక్కడికక్కడ అంగన్‌వాడీ టీచర్లు, ఆయాలను ఈడ్చిపారేసిం ది.

కాకినాడ కలెక్టరేట్‌ వద్ద ఆందోళన చేస్తున్న అంగన్‌వాడీలు...
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

  • జిల్లాలో అంగన్‌వాడీలపై పోలీసు ప్రతాపం

  • విజయవాడ మహాసభకు బయలుదేరిన మహిళలపై ఎక్కడికక్కడ ఉక్కుపాదం

  • రైల్వేస్టేషన్లు, బస్టాండ్ల వద్ద మాటు వేసి మరీ స్టేషన్లకు లాక్కుపోయిన వైనం

  • పిఠాపురంలో వందలాదిమంది మహిళలను రాత్రంతా స్టేషన్లో కూర్చోబెట్టి కర్కశత్వం

  • కనీసం కాలకృత్యాలకు కూడా వెళ్లనీయకుండా నరకయాతన పెట్టిన పోలీసులు

  • మహిళలను రాత్రంతా ఇబ్బంది పెట్టడంపై స్టేషన్‌ ఎదుట ఆందోళనకు దిగిన టీడీపీ

  • సామర్లకోటలో పోలీసుల అదుపులో ఉన్న అంగన్‌వాడీ కార్యకర్తకు అస్వస్థత

  • ఎక్కడికక్కడ బస్సులు, వ్యాన్లు ఎక్కిన వారిని బలవంతంగా దించి స్టేషన్లకు తరలింపు

  • విజయవాడ వైపు ప్రయాణించే వెళ్లే రైళ్లన్నీ వెళ్లిపోయిన తర్వాత వదిలిన వైనం

  • ప్రభుత్వతీరుకు వ్యతిరేకంగా కలెక్టరేట్‌వద్ద గుమిగూడి గర్జించిన అంగన్‌వాడీలు

(కాకినాడ, ఆంధ్రజ్యోతి)/పిఠాపురం

జిల్లాలో అంగన్‌వాడీలపై రాష్ట్రప్రభుత్వం ఉక్కుపాదం మో పింది. తమ న్యాయ మైన డిమాండ్ల సాధనకోసం విజయవా డలో నిర్వహిస్తున్న మహాసభకు తరలి వెళ్తున్న వారిపై కర్క శంగా వ్యవహరించింది. మహిళలని కూడా చూడకుండా పాశవికంగా ప్రవర్తించింది. పోలీసులను అడ్డం పెట్టుకుని ఎక్కడికక్కడ అంగన్‌వాడీ టీచర్లు, ఆయాలను ఈడ్చిపారేసింది. ఆదివారం అర్ధరాత్రినుంచి సోమవారం ఉదయం వరకు వేలాదిమందిని స్టేషన్లలో ఉంచి నరకయాతన చూపించింది. పిఠాపురంలో వందలాదిమంది మహిళలను అర్ధరాత్రి స్టేషన్‌ కు తరలించి ఉదయం వరకు అక్కడే ఉంచి కాలకృత్యాలకు కూడా వెళ్లనీయకుండా నిర్బంధించారు. దీంతో టీడీపీ ఆం దోళనకు దిగింది. సామర్లకోటలో పోలీసుల అదుపులో ఉన్న అంగన్‌వాడీ మహిళకు అస్వస్థతకు గురవగా, ఆస్పత్రికి తర లించాలని సాటి అంగన్‌వాడీలు పోలీసులను కోరినా కనీసం ఖాతరు చేయలేదు సరికదా వారితో గొడవకు దిగారు. మరో పక్క బస్సులు, వ్యాన్లలో విజయవాడకు బయలుదేరిన వారిని గుర్తించి స్టేషన్‌కు లాక్కుపోయారు. జిల్లానుంచి విజయవాడ వైపు ప్రయాణించే రైళ్లన్నీ వెళ్లిపోయే వర కు వేలాదిమంది మహిళలను స్టేషన్‌లోనే ఉంచేశారు. దీంతో అనేకచోట్ల పోలీ సులు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా అంగన్‌వాడీలు పోలీస్‌ స్టేషన్ల ఎదుట ఆందోళనకు దిగారు. ఆ తర్వాత కలెక్టరేట్‌కు వేలాదిగా కదిలి ప్రభుత్వానికి వ్యతిరేకంగా గర్జించారు.

ఎక్కడికక్కడ లాక్కుపోయారు..

అంగన్‌వాడీలకు తెలంగాణ కంటే అధికంగా వేతనాలు ఇవ్వాలని, గతంలో వేత నాల పెంపు విషయంలో జగన్‌ ఇచ్చి న హామీలను నెరవేర్చాలని రాష్ట్రఅంగన్‌వాడీ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ సోమవారం ఛలో విజయవాడకు పిలుపునిచ్చిం ది. అక్కడే మహాధర్నా, సభకు సన్నద్ధమైంది. ఈ నేపథ్యంలో జిల్లా నలుమూలలనుంచి వేలాదిమంది అంగన్‌వాడీ టీచర్లు, ఆయాలు ఆదివారం రాత్రి విజయవాడకు బయలుదేరడానికి సిద్ధమయ్యారు. అనేకమంది తుని, సామర్లకోట, అన్నవరం, పిఠాపురం తదితర స్టేషన్లకు చేరుకున్నారు. తీరా ప్రభుత్వం అంగన్‌వాడీల ఆందోళనకు ముందే భయపడి ఎక్కడికక్కడ అణచివేయాలని పోలీసులను ఆదేశించింది. దీంతో ఆదివారం రాత్రి నుంచి సోమవారం మధ్యాహ్నం వరకు జిల్లాలో తుని, పిఠాపురం, సామర్లకోట, పెద్దాపురం, గండేపల్లి, జగ్గంపేట, తాళ్లరేవు, కరప, కాకినాడ, కాకినాడ రూరల్‌ ఇలా అనేక మం డలాల్లో పోలీసులు అంగన్‌వాడీలపై ఉక్కుపాదం మోపారు. సీఆర్‌పీసీ 151 సెక్షన్‌ పేరుతో జిల్లావ్యాప్తంగా వేలాదిమందిని అరెస్ట్‌ చేసి స్టేషన్లకు తీసుకుపోయారు. పిఠాపురంలో పోలీసు ల తీరు విమర్శలకు దారితీసింది. విజయవాడకు బయలు దేరిన అంగన్‌వాడీ మహిళను ఆదివారం రాత్రి స్టేషన్‌కు తర లించారు. అక్కడినుంచి సోమవారం ఉదయం పదిగంటల వరకు స్టేషన్‌లోనే వందలాది అంగన్‌వాడీ టీచర్లు, ఆయాల ను కూర్చోబెట్టారు. దీంతో అర్ధరాత్రి నిద్రలేకుండా స్టేషన్‌లోనే నరకయా తన పడ్డారు. కనీసం మహిళలను కాలకృత్యాలకు సైతం పంపకుండా నిర్బంధించి నరకం చూపించారు. బయ టకు వెళ్తే ఎక్కడ విజయవాడ వెళ్లిపోతారోననే భయంతో వేధించారు. దీంతో మహిళలంతా స్టేషన్‌లో ఆందోళన చేసినా పోలీసులు కనికరించలేదు. విషయం తెలుసుకున్న పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ ఉదయం స్టేషన్‌కు వెళ్లి ఆందోళనకు దిగారు. మహిళలను నిర్బంధించడంపై ఆగ్రహం వ్యక్తం చేసి నిరసన వ్యక్తం చేశారు. చివరకు పిఠాపురం, సామర్లకోట మీ దుగా విజయవాడ వైపు ప్రయాణించే రైళ్లన్నీ వెళ్లిపోయిన త ర్వాత సోమవారం ఉదయం 11 గంటలకు విడిచిపెట్టారు. అ టు సామర్లకోట స్టేషన్‌లో అంగన్‌వాడీలను అరెస్ట్‌ చేసిన పో లీసులు స్టేషన్‌కు తరలించారు. అక్కడ ఓ మహిళ అస్వస్థత కు గురవగా పోలీసులు కనీసం ఆస్పత్రికి తరలించలేదు. దీం తో పోలీసులు, అంగన్‌వాడీలకు మధ్య వాగ్వి వాదం జరిగింది. తాళ్లరేవు, గొల్లప్రోలులో వ్యాన్లు ఎక్కిన వారిని దించేసి స్టేషన్‌కు తర లించారు. కరపలో పెనుగుదురు వంతెన వద్ద అంగన్‌వాడీలను అరెస్ట్‌ చేసి సోమవా రం మధ్యాహ్నం వదిలిపెట్టారు. జిల్లా అంతా కలిపి 527మందిని అరెస్ట్‌ చేసి ఆ తర్వాత విడిచిపెట్టినట్లు పోలీసుశాఖ వెల్లడించింది. మరోపక్క ప్రభుత్వం, పోలీసుల తీరును నిర సిస్తూ పెద్దాపురం, కరప, గండేపల్లి తదితర మండలాల్లో ఆయా స్టేషన్ల ఎదుట మహి ళలు ఆందోళనకు దిగారు. వీరికి టీడీపీ, జన సేన, ఇతర వామపక్ష పార్టీలు సంఘీభావం ప్రకటించాయి.

కలెక్టరేట్‌ వద్ద

అంగన్‌వాడీల ధర్నా

పోర్టుసిటీ(కాకినాడ), మార్చి 20: అంగన్‌వాడీ టీచర్ల ను, ఆయాలను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్లకు తర లించడాన్ని ఖండిస్తూ అంగన్‌వాడీలు సుందరయ్య భవ న్‌నుంచి ర్యాలీగా కలెక్టరేట్‌కు చేరుకునే సందర్భంలో పో లీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. కానీ వారి నిర్బం ధాన్ని ఛేదించుకుంటూ వారు కలెక్టరేట్‌వద్ద ధర్నా నిర్వ హించారు. ఈ సందర్భంగా జగన్‌ ఇచ్చిన హామీని అ మలు చేయమంటే అరెస్టులు చేస్తారా అంటూ, సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీ అమలు చేయాలని, అరె స్టు చేసిన వారందరినీ తక్షణమే భేషరతుగా విడుదల చేయాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సీఐ టీయూ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు దువ్వా శేషబాబ్జి, చె క్కల రాజ్‌కుమార్‌ మాట్లాడుతూ తెలంగాణలో అంగన్‌ వాడీలకు రూ.13650 చెల్లిస్తుంటే ఆంధ్రప్రదేశ్‌లో జగన్‌ ప్రభుత్వం రూ.11,500 మాత్రమే చెల్లిస్తోందన్నారు. అధి కారంలోకి రాక ముందు తెలంగాణ కంటే అదనంగా వెయ్యి రూపాయలు చెల్లిస్తానని వాగ్ధానం చేసిన జగన్‌ నాలుగేళ్లు గడుస్తున్నా అంగన్‌వాడీలకు తెలంగాణ కంటే రూ.2వేలు తక్కువ చెల్లిస్తున్నారని విమర్శించారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గుజరాత్‌, కర్ణాటక రాష్ట్రాల్లో అమలు జరుగుతున్నట్టు ఇక్కడ కూడా అంగన్‌వాడీ లకు గ్రాట్యుటీ చెల్లించాలని డిమాండ్‌ చేశారు. మినీ వర్కర్లను మెయిన్‌వర్కర్లుగా గుర్తించి సమాన వేతనం చెల్లించా లని, బిల్లులు సక్రమంగా చెల్లించాలని కోరు తూ శాంతి యుతంగా తలపెట్టిన విజయవాడ ధర్నాని జగన్‌ ప్రభుత్వ నిర్బంధంవల్ల రాష్ట్రవ్యాప్తంగా నిరసన లు మిన్నంటాయన్నారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కోశాధికారి మలకా రమణ, ఎంకే జ్యోతి, దీప్తి, రాధ, సత్యవేణి, నాగమణి, నాగురా, సుప్రియ, ప్రేమ జ్యోతి, వెంకటలక్ష్మి పాల్గొన్నారు.

Updated Date - 2023-03-21T00:52:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising