ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నేడు డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలో తొలి రిపబ్లిక్‌డే వేడుకలు

ABN, First Publish Date - 2023-01-26T01:58:29+05:30

డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా కేంద్రమైన అమలాపురంలోని జీఎంసీ బాలయోగి స్టేడియంలో గురు వారం జరిగే తొలి రిపబ్లిక్‌ డే వేడుకలకు సర్వసన్నద్ధమవుతోంది. జిల్లా ఆవి ర్భావం తరువాత తొలిసారిగా జరుగుతున్న రిపబ్లిక్‌డే వేడుకలను ఘనంగా నిర్వహించడానికి పోలీసు, రెవెన్యూ సహా వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. పోలీసు బెటాలియన్‌ ఆధ్వర్యంలో జి

గణతంత్ర దినోత్సవాలకు సిద్ధమైన జీఎంసీ బాలయోగి స్టేడియం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏర్పాట్లు పూర్తిచేసిన జిల్లా అధికారులు

సంబరాలకు జీఎంసీ బాలయోగి స్టేడియం ముస్తాబు

అమలాపురం, జనవరి 25(ఆంధ్రజ్యోతి): డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా కేంద్రమైన అమలాపురంలోని జీఎంసీ బాలయోగి స్టేడియంలో గురు వారం జరిగే తొలి రిపబ్లిక్‌ డే వేడుకలకు సర్వసన్నద్ధమవుతోంది. జిల్లా ఆవి ర్భావం తరువాత తొలిసారిగా జరుగుతున్న రిపబ్లిక్‌డే వేడుకలను ఘనంగా నిర్వహించడానికి పోలీసు, రెవెన్యూ సహా వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. పోలీసు బెటాలియన్‌ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్‌ హిమా న్షుశుక్లా గౌరవ వందనం స్వీకరించనున్నారు. పోలీసు, ఎన్‌సీసీ క్యాడెట్ల నుంచి కవాతు అనంతరం ప్రభుత్వంలోని వివిధ శాఖల అధికారులు రూపొందిస్తు న్న ప్రత్యేక శకటాల పరేడ్‌ కూడా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నా యి. సాంస్కృతిక కార్యక్రమాలు కూడా పెద్దఎత్తున ఏర్పాటుచేశారు. భారీ స్థాయిలో రిపబ్లిక్‌ డే వేడుకలు నిర్వహణకు జిల్లా యంత్రాంగం కసరత్తు చేస్తోంది. డీఆర్వో సీహెచ్‌ సత్తిబాబు, ఆర్డీవో ఎన్‌ఎస్‌వీబీ వసంతరాయుడు, తహశీల్దార్‌ పి.శ్రీపల్లవి, డీఎస్‌వో పీఎస్‌ సురేష్‌కుమార్‌లు ఏర్పాట్లను పర్య వేక్షిస్తున్నారు. ఉదయం తొమ్మిది గంటలకు కలెక్టర్‌ ఆధ్వర్యంలో జాతీయ పతాక ఆవిష్కరణ, 9.10 గంటలకు పోలీసు కవాతు స్వీకరణ, 9.30 గంటలకు కలెక్టర్‌ ఉపన్యాసం, తరువాత శకటాల ప్రదర్శన, సాంస్కృతిక కార్యక్రమాలు, అనంతరం విశిష్ఠ సేవలకు పురస్కారాల ప్రదానం నిర్వహించనున్నారు.

Updated Date - 2023-01-26T01:58:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising