ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

బైక్‌ల దొంగ అరెస్టు

ABN, First Publish Date - 2023-11-29T00:15:17+05:30

మోటార్‌సైకిళ్లు, సెల్‌ఫోన్లను దొంగిలిస్తున్న కాకినాడ జిల్లా కరప మండలానికి చెందిన యెశెట్టి వెంకటరమణను అదుపులోకి తీసుకున్నట్లు బిక్కవోలు ఎస్‌ఐ పి.బుజ్జిబాబు తెలిపారు.

బిక్కవోలు, నవంబరు 28: మోటార్‌సైకిళ్లు, సెల్‌ఫోన్లను దొంగిలిస్తున్న కాకినాడ జిల్లా కరప మండలానికి చెందిన యెశెట్టి వెంకటరమణను అదుపులోకి తీసుకున్నట్లు బిక్కవోలు ఎస్‌ఐ పి.బుజ్జిబాబు తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం బిక్కవోలు-ఆర్‌ఎస్‌ పేట రైల్వే ఫ్లైఓవర్‌ బ్రిడ్జి వద్ద మంగళవారం ఉదయం వాహనాలు తనిఖీ చేస్తుండగా వెంకటరమణ తమను చూసి బైక్‌పై పారిపోవడానికి ప్రయత్నించగా సిబ్బంది సాయంతో అతనిని అదుపులోకి తీసుకున్నామన్నారు. బండికి సంబంధించి ఏవిధమైన రికార్డులు లేకపోవడంతో అతనిని విచారించగా తాను ఇప్పటి వరకూ 9 బైక్‌లు, 9 సెల్‌ఫోన్లను దొంగిలించానని తెలిపాడన్నారు. వీటిని స్వాధీనం చేసుకున్నామని బిక్కవోలు పోలీస్‌స్టేషన్‌లో రెండు, పెద్దాపురం పోలీస్‌స్టేషన్‌లో నాలుగు, పెదపూడిలో ఒకటి, పాయకరావుపేటలో ఒకటి, సర్పవరంలో ఒకటి, కాకినాడ టూటౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఒక కేసు నమోదై ఉన్నాయన్నారు. వాటి విలువ రూ.8 లక్షలు ఉంటుందన్నారు. అలాగే ఏడు సెల్‌ఫోన్లను కాకినాడ పరిసర ప్రాంతాల్లోను, ఒకటి పెద్దాపురం, ఒకటి ఉండూరులో దొంగిలించినట్లు వెంకటరమణ తెలిపాడన్నారు. ఈ సెల్‌ఫోన్లకు సంబంధించి ఆధారాలు, కొన్న బిల్లులు తీసుకువస్తే అధికారుల ఉత్తర్వుల మేరకు వారికి అందజేస్తామన్నారు. ఈ నేరాలలో అతనితో పాటు మరో ఇద్దరు బాలురు పాల్గొన్నట్లు గుర్తించామని వారిపై బాలల సంరక్షణ, రక్షణ చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని ఎస్‌ఐ బుజ్జిబాబు వివరించారు.

Updated Date - 2023-11-29T00:15:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising